- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయన వస్తే.. కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకే!.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు ను కలిసేందుకే హరీష్ రావు అమెరికా వెళ్లాడు.. ఆయన ఇండియాకు వస్తే.. కుటుంబం మొత్తం జైలుకు వెళుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అవతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఆయన బీఆర్ఎస్ నాయకులపై సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ను మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు అని పిలవద్దని, రాక్షసుడు అనాలని మండిపడ్డారు. ప్రపంచంలో ఎవరూ చేయలేని నీచమైన పని టెలిఫోన్ ట్యాపింగ్ చేయించారని, ప్రభాకర్ రావు అనే రిటైర్ట్ అధికారిని అడ్డం పెట్టుకొని ఆయన కింద ఓ రౌడీ గ్యాంగ్ రాధకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న అనే రౌడీలతో బిజినెస్ మెన్ లను నాయకులను బెదిరించి లక్షల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. తెలంగాణ మంత్రులమని ఎక్కడైనా చెప్పుకోవాలంటే సిగ్గుపడే పరిస్థితికి తెలంగాణను తీసుకొచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు రెండు రోజుల క్రితం అమెరికా వెళ్లాడని, ప్రభాకర్ రావు ను కలిసేందుకే హరీష్ రావును కేసీఆర్ అమెరికా పంపాడని అన్నారు.
ఆయన ఇండియా వస్తే.. ఫ్యామిలి మొత్తం జైలుకు వెళ్లాల్సి వస్తుందని తెలిసి, రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేవరకు ఇండియా రావద్దని ప్రభాకర్ రావుకు చెప్పడానికే హరీష్ ను పంపాడని అన్నారు. అంతేగాక బెయిల్ కోసం లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేలా లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు అన్నిచోట్ల బీజేపీకే ఓట్లు వేయించారని తెలిపారు. ఇక ఇవ్వాళ కేసీఆర్ మాటలు వింటుంటే బాధ అనిపిస్తుందని, మంత్రి పదవి రాక తెలంగాణ ఎత్తుకున్నడు తప్ప, తెలంగాణ మీద గానీ ప్రజల మీద కానీ ఏ అవగాహాన లేదని దుయ్యబట్టారు. 1999 సంవత్సరంలో 41 మంది ఎమ్మెల్యేలం పదే పదే ఢిల్లీకి వెళ్లి సోనియాను కలిసి రాష్ట్రం కావాలని ప్రయత్నాలు చేస్తుంటే.. రెండు సంవత్సరాలు డిప్యూటీ స్పీకర్ పదవి అనుభవించిన తర్వాత తెలంగాణ పదం ఎత్తుకున్నాడని తెలిపారు. ఆయన ఎత్తుకున్నదాక తెలంగాణ గురించి తెలియదని మాట్లాడుతున్నాడని, 69 ఉద్యమంలో తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్లు, అమరులైన వారు, తెలంగాణ కోసం పోరాటం చేసిన వారు ఎక్కడ పోయారని ఎద్దేవా చేశారు.
స్ట్రీట్ ఫైటా స్టేట్ ఫైటా అని అడిగానని మాట్లాడుతున్నాడని, నేను చావాలి లేదా తెలంగాణ రావాలి అని మాట్లాడుతున్నాడని, తెలంగాణ కోసం ఎవరు చనిపోయారో తెలియదా.. మీ దీక్షల పేరుమీద నాటకాలతోటి అమాయకులను రెచ్చగొట్టి చంపింది మీరు కాదా అని మండిపడ్డారు. ఆయన మాటలు వింటుంటే.. పదేళ్లు తెలంగాణ ప్రజలు ఎలా బరించారా అని అనిపిస్తుందన్నారు. తెలంగాణ ఇచ్చి 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది సోనియాగాంధీ అయితే.. సావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిన అని గడికోసారి చెబుతున్నాడని, ఎవరూ అవునన్నా, కాదన్నా తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని అసెంబ్లీ సాక్షిగా చెప్పి, గద్దెనెక్కిన తర్వాత పదేళ్ల పాటు ఆమెను, ఆమె కోడుకును నోటికి వచ్చినట్టు తిట్టాడని మండిపడ్డారు.
కేసీఆర్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని, ఎల్లుండి తో ఆ పార్టీ దుకాణం క్లోజ్.. పార్టీలో ఎవరు ఉండరు.. ఉన్నవాళ్లు కూడా ఈ కుటుంబంతో పాటు జైళ్లో ఉంటారని తెలిపారు. ఎస్ఎల్బీసీ సోరంగానికి 1350 కోట్లు ఖర్చు పెట్టామని, దాన్ని ముట్టుకోకుండా.. ఎన్నికల ముందు వచ్చి కుర్చీ వేసుకొని కూర్చొని పూర్తి చేయిస్తా అని 10 ఏళ్లలో 10 కి మీ లు కూడా తవ్వలేదని అన్నారు. అవసరం లేని కాళేశ్వరం కట్టి, ప్రపంచంలో వింత అంటే అది మూడేళ్లకే కూలిపోయిందన్నారు. రైతు బందు వల్ల వేల ఎకరాలు ఉన్నవాళ్లు బాగుపడ్డారని, పేద రైతులు ఒక్కరు కూడా బాగుపడలేదన్నారు. మల్లన్న సాగర్ తో ఫామ్ హౌజ్ లోకి కాలువ వేసుకొని వడ్లు పండించుకుంటున్నాడని, రైతులకు వరి వేస్తే ఉరి అని ఆయన వరి పండించి కోట్లు సంపాదిస్తున్నారు. సంక్షేమ పథకాలు వదిలిపెట్టి డ్యాంలు కట్టి కమీషన్ తీసుకున్నాడని, ధరణి పెట్టి లక్ష ఎకరాలు దోచుకున్నాడని, లిక్కర్ స్కాంలు, టానిక్ షాపులు పెట్టి ప్రజలను దోచుకున్నాడని, వీటి గురించి మాట్లాడటానికి అసెంబ్లీకి రమ్మంటే రాకుండా నల్లగొండ పోయి సభ పెట్టారని, ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నల్లగొండ పోవడానికి సిగ్గుండాలి అన్నారు.