- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
HYDRA: నేడు బెంగళూరుకు ‘హైడ్రా’ బృందం.. చెరువుల పునరుజ్జీవంపై అధ్యయనానికి మరో అడుగు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు (Buffer Zone), ఎఫ్టీల్ (FTL) పరిధిలోని భూముల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటు చేసిన హైడ్రా (Hyderabad Disaster Response and Asset Monitoring and Protection Agency) ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది. ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) నేతృత్వంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడులు, బెదిరింపులకు తలొగ్గకుండా.. హైడ్రా (HYDRA) స్వతంత్రంగా పనిచేస్తూ అక్రమార్కుల భరతం పడుతోంది.
ఈ క్రమంలోనే బెంగళూరు (Bangaluru)లో చెరువుల పునరుజ్జీవనంపై క్షేత్ర స్థాయిలో స్థితిగతులను అధ్యయనం చేయడం, మురుగునీరు స్వచ్ఛంగా మార్చడం, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (Disaster Management)లో అనుసరించిన విధానాలను పరిశీలించేందుకు కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) సారథ్యంలోని ‘హైడ్రా’ బృందం నేటి నుంచి రెండు రోజుల పాటు బెంగళూరు (Bangaluru)లో పర్యటించనున్నారు.
అక్కడ చెరువులను అధ్యయనం చేసి హైదరాబాద్ (Hyderabad) మహానగర పరిధిలోని ఉన్న బాచుపల్లిలోని ఎర్రగుంట చెరువు, మాదాపూర్‌లోని సున్నంచెరువు, కూకట్‌పల్లిలోని నల్లచెరువు, రాజేంద్రనగర్‌లోని అప్పచెరువులకు పునరుజ్జీవం కల్పించనున్నారు. అదేవిధంగా భారీ వర్షాలు పడినప్పుడల్లా హైదరాబాద్ (Hyderabad) మహా నగరాన్ని వరద నీరు ముంచెత్తడం, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు బెంగళూరు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిపుణులతో ‘హైడ్రా’ అధికారులు సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది.