HYDRA: హైదరాబాద్‌లో ‘హైడ్రా’ దూకుడు.. ఆరుగురు అధికారులపై కేసు నమోదు

by Shiva |   ( Updated:2024-08-31 07:43:52.0  )
HYDRA: హైదరాబాద్‌లో ‘హైడ్రా’ దూకుడు.. ఆరుగురు అధికారులపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో హైడ్రా దూకుడు పెంచింది. ఈ మేరకు ఆక్రమణలకు గురైన భూములను పరిరక్షించడంలో ఏ మాత్రం ఉపేక్షించకుండా పక్కగా ముందుకెళ్తోంది. పెద్ద పెద్ద నిర్మాణాలను సైతం బుల్డోజర్లతో ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ నిర్మాణాలకు కారణమైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా అక్రమార్కలపై చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. ఈ మేరకు తాజాగా మొత్తం ఆరుగురు అధికారులపై హైడ్రా కేసులు నమోదు చేసింది. అందులో హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజ్‌కుమార్‌, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్, బాచుపల్లి తహశీల్దార్ పూల్‌సింగ్‌, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, మేడ్చల్-మల్కాజ్‌గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్‌పై ఈవోడబ్ల్యూ వింగ్‌లో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి కేసులు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed