- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
crime news : మక్తల్ మండలంలో 24 గంటల్లో పగలు వరుస దొంగతనాలు..
దిశ, మక్తల్ : 24 గంటల్లో మక్తల్ ( Makhtal ) మండలంలోని కర్ని గ్రామంలో శుక్ర, శనివారం పట్టపగలు వరుసగా రెండు రోజులు రెండు ఇళ్లలో తాళాలు విరగొట్టి నగదు, నగలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ ( thefts ) చేశారు. నవంబర్ నెలలో ఉప్పరి నవీన్ అనే వ్యక్తి ఇంట్లో పెళ్లి ఉందని కూడబెట్టిన కూలి డబ్బులు, పత్తి అమ్మితే వచ్చిన నగదు దాదాపు రెండున్నర లక్షల బంగారు ఆభరణాలను, శుక్రవారం ఈడ్గి గుంటేప్ప ఇంట్లో రూ.75 వేలను ఎత్తుకెళ్ళారు. ఒకే వీధిలో 24 గంటలలో కల్లు దుకాణాల దగ్గర ఉన్న రెండు ఇళ్ళలో చోరి జరిగింది. శుక్రవారం ఈడిగి గుంటేప్ప ఇంట్లో జరిగిన చోరీని పోలీసులు పర్యవేక్షించి వెళ్లగా శనివారం మళ్లీ అదే వీధిలోని ఉప్పరి నవీన్ ఇంట్లో చోరి జరిగింది.
గ్రామంలో జనాలు పత్తి కూలికి వెళ్లిన సమయంలో ఈ దొంగతనాలు చోటు చేసుకోవడం విశేషం. పొలంలో పత్తి ఏరడానికి వెళ్లిన ఉప్పరి నవీన్ చిన్నమ్మ ఆసుపత్రికి వెళ్ళాలని రమ్మని ఫోన్ చేయగా ఇంటికి వచ్చిన నవీన్ తాళం విరగొట్టి తలుపులు తీసి బీరువాలోని చీరలు, వస్తువులు చిందరవందరంగా పడి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ( police ) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే కర్ని గ్రామంలో కొందరు యువకులు రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా పేకాట మూడుముక్కలాట కొనసాగుతుందని. దీనితో పాటు వీధికో బెల్ట్ షాపు ఉండడంతో యువత పక్కదారి పట్టి ఈ దొంగదాన్ని కారణమై ఉండొచ్చని గ్రామంలోని ఓ పెద్దమనిషి అంటున్నాడు. పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపి గ్రామంలో కొనసాగుతున్న పేకాట మూడు ముక్కలాట. వీధికో బెల్ట్ షాపు, కోడిపందాలు పోలీసులు, ఉక్కు పాదం పెడితే నేరాలు అదుపులో ఉంటాయని గ్రామస్తులు అంటున్నారు.