రాష్ట్రంలో దారుణం.. మారుతల్లి కర్కశం.. ఒకరిని చంపి.. మరొకరిని!?

by Jakkula Mamatha |
రాష్ట్రంలో దారుణం.. మారుతల్లి కర్కశం.. ఒకరిని చంపి.. మరొకరిని!?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సమాజంలో రోజురోజుకు మానవత్వం మంట కలిసి పోతుంది. మూగ జీవులకు ఉన్న మానవత్వం కూడా మనిషికి లేకుండా పోతుంది. ఎటు పోతుంది ఈ సమాజం? ఇలాంటి సమాజంలో మనుగడ సాగిస్తున్నామా? అనిపించేలా దారుణమైన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా(Guntur District) లోని ఫిరంగిపురంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇద్దరి పిల్లలపై మారుతల్లి కర్కశంగా ప్రవర్తించింది. వివరాల్లోకి వెళితే.. సాగర్ అనే వ్యక్తికి గతంలో వివాహం జరిగింది. వారి జీవితం ఆనందంగా సాగిపోతుంది. వారికి కవల కుమారులు జన్మించారు. సంతోషంగా కొనసాగుతున్న వారి జీవితంలో విషాదం చోటుచేసుకుంది. అతని భార్య చనిపోయింది. దీంతో అతను ఫిరంగిపురానికి చెందిన లక్ష్మిని రెండో పెళ్లి చేసుకున్నారు.

ఈ క్రమంలో అతని రెండో భార్య ఆ కవల పిల్లలను ఎప్పుడు చిత్రహింసలకు గురిచేస్తుండేది. ఈ తరుణంలో నిన్న(ఆదివారం) మరీ దారుణంగా ప్రవర్తించింది. కార్తీక్ అనే బాలుడిని గోడకేసి కొట్టి చంపేసింది. అంతటితో ఆగకుండా మరో బాలుడి ఒంటిపై వాతలు పెట్టింది. కొట్టొద్దు అమ్మ అంటున్నా.. ఆమె గుండె కరుగలేదు. అయితే తీవ్ర గాయాలతో బాలుడు గట్టిగా అరవడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Next Story

Most Viewed