CV Anand: ఐపీఎల్‌లో రోహిత్ పూర్ ఫామ్ కంటిన్యూ.. సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2025-04-01 15:28:11.0  )
CV Anand: ఐపీఎల్‌లో రోహిత్ పూర్ ఫామ్ కంటిన్యూ.. సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2025‌ (IPL-2025)లో మ్యాచ్‌లు రసవత్తరంగా కొనసాగుతోన్నాయి. పిచ్‌తో సంబంధం లేకుండా కొన్ని మ్యాచ్‌లలో హైస్కోరింగ్ మ్యాచ్‌ (High Scoring Matches)లు కూడా నమోదు అవుతున్నాయి. అయితే, ఎప్పటిలాగే ఈసారి కూడా ముంబై జట్టు చెన్నై (Chennai), గుజరాత్ (Gujarat) జట్ల చేతిలో పరాజయం పాలైంది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పూర్ ఫామ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే రోహిత్‌పై హైదరాబాద్ పొలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ (CV Anand) కీలక సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఐపీఎల్‌ (IPL)లో రెండు వరుస మ్యాచ్‌లలో తక్కువ స్కోర్‌కే అవుట్ అవ్వడంతో హిట్‌మ్యాన్ (Hitman) కెరీర్ కొనసాగించే బదులు రిటైర్ అవ్వడం మంచిదని సలహా ఇచ్చారు. ‘అనుకోకుండా ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) మ్యాచ్ చూస్తున్నప్పుడు రోహిత్ శర్మ ఔటవ్వడం కనిపించింది. అతడి పరిస్థితి చూసి జాలి కలిగింది. ఎందుకు అతడు నవ్వుల పాలవుతున్నాడు అని అనిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) ఫైనల్ లాంటి అరుదైన సందర్భాల్లో మాత్రమే పరుగులు చేయగలుగుతున్నాడు. ఇలా అప్పుడప్పుడు పరుగులు చేస్తే గౌరవం దక్కుతుందా? ధోనీ, కోహ్లీలాగా ఆడతానే ఉంటావా?, కెరీర్ గొప్పగా ఉంది, మరి గౌరవప్రదమైన రిటైర్మెంట్ లేదే’ అంటూ సీవీ ఆనంద్ (CV Anand) టీవీలో మ్యాచ్ చూస్తూ ఫొటోనూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో విపపరీతంగా వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed