HYDRA: ఆక్రమణలపై మరోసారి ‘హైడ్రా’ యాక్షన్‌.. ఆ ప్రాంతంలో కూల్చివేతలు షురూ

by Shiva |
HYDRA: ఆక్రమణలపై మరోసారి ‘హైడ్రా’ యాక్షన్‌.. ఆ ప్రాంతంలో కూల్చివేతలు షురూ
X

దిశ, వెబ్‌డెస్క్/కూకట్‌పల్లి: హైదరాబాద్ (Hyderabad) నగరంలో మరోసారి ‘హైడ్రా’ అక్రమ నిర్మాణాలపై జూలు విదిల్చింది. ఈ మేరకు ఆదివారం ఉదయం ‘హైడ్రా’ అధికారులు అమీన్పూర్, కూకట్పల్లి ప్రాంతాల్లోని నల్లచెరువు (Nallacheruvu Lake) ఎఫ్టీఎల్ (FTL), బఫర్‌ జోన్ల (Buffer Zone)లో కూల్చివేతలను ప్రారంభించారు. తెల్లవారుజామునే ప్రొక్లెయినర్ల(Procleaners)తో అధికారులు స్పాట్‌కు చేరుకున్నారు. కూల్చివేతల సమయంలో ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా భారీగా పోలీసులను మోహరించారు. అయితే, నల్లచెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు కాగా, అందులో 7 ఎకరాల మేర ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల కింద భూమి ఆక్రమణకు గురైనట్లుగా ‘హైడ్రా’ (HYDRA) గుర్తించింది. అందులో 4 ఎకరాల బఫర్ జోన్‌లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఎఫ్టీఎల్‌లోని 3 ఎకరాల పరిధిలో 25 పక్కా భవనాలు, 16 తాత్కాలిక షెడ్లను నిర్మించి కొందరు వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అక్కడ అధికారులు సర్వే నిర్వహించి వారందరికీ నోటీసులను ఇప్పటికే జారీ చేసి కూల్చివేతలను ప్రారంభించారు. అదేవిధంగా అమీన్‌పూర్ పరిధిలోని కిష్టారెడ్డిపేట్ (Kishtareddy Pet) సర్వే నెంబర్ 164లో ఉన్న ఆక్రమణలను కూడా ‘హైడ్రా’ అధికారులు తొలగిస్తున్నారు.

Next Story

Most Viewed