'బుల్డోజర్ న్యాయం' తీర్పుపై హైడ్రా కమిషనర్ స్పందన

by M.Rajitha |
బుల్డోజర్ న్యాయం తీర్పుపై హైడ్రా కమిషనర్ స్పందన
X

దిశ, వెబ్ డెస్క్ : బుల్డోజర్ న్యాయాన్ని ఆపమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైడ్రా(HYDRA) కమిషనర్ రంగనాథ్(Ranganath) స్పందించారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలు హైడ్రాకు వర్తించవని, అవి కేవలం యూపీలోని నేరస్తుల, నిందితుల ఆస్తుల కూల్చివేతలకు మాత్రమే వర్తిస్తాయని అన్నారు. హైడ్రా అనేది ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తుందని స్పష్టతనిచ్చారు. బహిరంగ స్థలాలు, రైల్వే ఆస్తులు, నీటి వనరుల ఆక్రమణలో తమ తీర్పు వర్తించదని సుప్రీం వివరణ ఇచ్చిందని గుర్తు చేశారు. నేరస్తులు, నిందితులుగా ముద్ర పడిన వాళ్ల ఆస్తులను, నిర్మాణాలను కూల్చరాదంటూ మాత్రమే కోర్టు చెప్పిందని వివరించారు రంగనాథ్. కాగా... తమకు ఎలాంటి నోటీసుకు ఇవ్వకుండానే తమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసిందని, తమకు న్యాయం చేయాలంటూ ఇటీవల కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు కూల్చివేతలకు సంబంధించి ఆదేశాలు జారీ చేయగా... హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ వివరణ ఇచ్చారు.

Advertisement

Next Story