- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళిత హక్కులకు భంగం కలిగితే అక్కడ నేను ఉంటా
దిశ, మక్తల్ : దళిత హక్కులకు భంగం కలిగితే వారి వెంట నేను ఉంటానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి.వెంకటయ్య అన్నారు. మక్తల్ నియోజకవర్గం క్రిష్ణా మండలం ముడుమాల గ్రామంలో గత నెల 18వ తేదీన గుడి లోపల దళితులు పెళ్లి జరుపుకోరాదని అడ్డుకున్న పూజారి చక్రపాణి పై గురువారం గ్రామంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి.వెంకటయ్య బహిరంగ విచారణ జరిపారు. మక్తల్ విశ్రాంతి భవనం లో విలేకరులతో మాట్లాడుతూ ..నారాయణ పేట జిల్లాలో రెండు గ్లాసుల పద్ధతి ఉందని, దళితులు ఆలయల్లోకి ప్రవేశం లేకపోవడం లాంటి సమస్యలపై ప్రస్తావిస్తూ వీటిని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, వచ్చే నెల 17 వరకు ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దళితులు గుళ్లో పెళ్లి చేసుకోకుండా అడ్డుకున్న పూజారిపై ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అరెస్టు చేసి బెయిలివ్వకుండా జైలుకు పంపాలన్నారు.
వంద ఎకరాల పై పట్టా ఉన్న భూస్వామిని సీలింగ్ ప్రకారం ఆయన భూమిని చట్టప్రకారం తీసుకొని దళితులకు పెంచాలన్నారు. గుడిలో పూజారి గా ఉండి మాగనూర్ ఎంపిడిఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పూజారి చక్రపాణి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న తన జీతాన్ని రికవారి చేయాలన్నారు. దళితను అగౌరపరిచినందుకు శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రభుత్వానికి తను నివేదిక పంపిస్తానన్నారు. రాష్ట్రంలో నారాయణపేట జిల్లాలోని అస్పృశ్యత రెండు గ్లాసుల పద్ధతి కొనసాగుతుందని అందుకే కమిషన్ కార్యాలయాన్ని ప్రారంభించి ఎస్సీ, ఎస్టీల సమస్యల కోసం తమ కమిషన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని, ఎక్కడైనా దళితులపై దాడులు, అవమాన సంఘటనలు జరిగితే స్థానిక పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తెలపాలని ఈ విషయాన్ని తనకు వాట్సప్ ద్వారా సమాచారం అందిస్తే సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్,ఆర్డీవో మధు మోహన్, డీటీడీఓ శత్రునాయక్, డిఎస్ డిఒ ఉమాపతి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి ఖలీల్,డీఎస్పీ మహేష్ పాల్గొన్నారు.