PM Modi: కాంగ్రెస్‌ది నక్సల్ మైండ్‌సెట్: ప్రధాని మోడీ

by S Gopi |   ( Updated:2024-09-19 16:27:42.0  )
PM Modi: కాంగ్రెస్‌ది నక్సల్ మైండ్‌సెట్: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన దేవతల వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నక్సల్ మైండ్‌సెట్‌ను ప్రదర్శిస్తోందని, ఇది ఆ పార్టీ ఇతర మతాలు, దేశాల నుంచి తెచ్చిపెట్టుకున్న ధోరణి అని మోడీ విమర్శించారు. గురువారం జమ్మూకశ్మీర్‌లోని కత్రాలో జరిగిన ర్యాలీ ప్రసంగించిన మోడీ.. 'కాంగ్రెస్ ఎప్పుడైనా మన విశ్వాసం, సంస్కృతిని ఓట్ల కోసం పణంగా పెడుతుంది. ఆ పార్టీ వారసుడు(రాహుల్ గాంధీ) విదేశాలకు వెళ్లి మన దేవి-దేవతలు దేవుళ్లు కాదని అంటారు. ఇది మన విశ్వాసాన్ని అవమానించడమే. ఇందుకు కాంగ్రెస్‌ను శిక్షించాలని' మోడీ మండిపడ్డారు. ఇదంతా వాళ్లు ఏదో అనాలని, పొరపాటుగానో అనడంలేదు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన కుట్ర. ఇతర మతాలు, దేశాల నుంచి తెచ్చిపెట్టుకున్న మైండ్‌సెట్. కాంగ్రెస్ నక్సల్ మైండ్‌సెట్‌తో జమ్మూలోని డోగ్రా సంస్కృతిని అవమానిస్తోందన్నారు. కాగా, ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ భారత్‌లో దేవత అనే భావానికి అర్థం చెబుతూ.. దేవత అంటే ఆంతరంగీక భావానికి సమానంగా బయట కూడా వ్యక్తీకరించే వ్యక్తి అన్నారు. అంటే ఆ వ్యక్తి పూర్తిగా పారదర్శకంగా ఉండటాన్ని దేవుడుగా భావిస్తారని పేర్కొన్నారు.

Advertisement

Next Story