ఎమ్మెల్యే అబ్రహం ఫ్లెక్సీలను తగలబెట్టిన యువకులు

by Disha News Desk |
ఎమ్మెల్యే అబ్రహం ఫ్లెక్సీలను తగలబెట్టిన యువకులు
X

దిశ, ప్రతినిధి, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల పరిధిలో మాన్ దొడ్డి గ్రామంలో ఆదివారం అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహాం ప్లెక్సీలు గ్రామానికి చెందిన యువకులు తగులబెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాన్ దొడ్డి గ్రామానికి చెందిన హసన్ వృత్తి రీత్యా టైర్ పంచర్ షాప్ నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. తనకు వచ్చిన ఆదాయంలో కొంత పలు సేవా కార్యక్రమాలకు వినియోగించాడు. గ్రామంలో త్రాగు నీటి ట్యాంకులు నిర్మించారు. వైద్యం కోసం ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలు నగదు సాయం చేసేవాడు. ఇదే క్రమంలో జనవరి 16న తన తల్లి గోకార్ బీ జ్ఞాపకార్థం గ్రామంలో రూ.6 లక్షలతో జాతిపితా మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహాం చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించాలన్నా ఉద్దేశంతో మూడు రోజుల క్రితం ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ఎమ్మెల్యే చేతుల మీదుగా జనవరి 16న గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. విగ్రహ ఆవిష్కరణ కోసం ప్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఆదివారం గ్రామంలో నిర్వహిస్తున్న అంతరాష్ట్ర ఓపెన్ కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే తిరిగి వెళ్లిపోయారు‌.‌ దీంతో మనస్తాపం చెందిన హసన్ గాందీజి విగ్రహాన్ని హసన్ కుమారుడు చేతుల మీదుగా ప్రారంభించారు‌‌. అదే సమయంలో అటుగా వెళ్తున్న అలంపూర్ ఎమ్మెల్యే హేళనగా చూసి వెళ్లిపోయాడు. దీంతో గ్రామానికి చెందిన కొందరు యువకులు ఎమ్మెల్యే అబ్రహం ప్లెక్సీలు చించి దహనం చేశారు. హాసన్ వృత్తి రీత్యా చిరు వ్యాపారి అయిన కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలవడం తో యువకులు అతనికి మద్దతుగా నిలిచారు.

Advertisement

Next Story

Most Viewed