- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పోలీసులు ఎప్పుడు విచారణకు రమ్మన్నా వస్తాను : చిరుమర్తి లింగయ్య
దిశ, జూబ్లీహిల్స్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది. సోమవారం జూబ్లిహిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిన చిరుమర్తి లింగయ్య ఆరోగ్యం బాలేక, గురువారం మధ్యాహ్నం ఒంటిగంట కు హాజరైన లింగయ్య తిరుపతన్నతో మాట్లాడిన ఫోన్ కాల్స్‌పై జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో పోలీసులు మాజీ ఎమ్మెల్యేను విచారించారు. ప్రస్తుతం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులైన మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ ట్యాప్ చేయడంపై పలు ప్రశ్నలు కురిపించారు. ఈ ఇద్దరి ఫోన్‌లు ట్యాప్ చేసినట్టు వచ్చిన రిపోర్టును లింగయ్య ఎదుట పెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా డబ్బు తరలింపు పైనా ప్రశ్నలు సంధించారు. విచారణ అనంతరం చిరుమర్తి లింగయ్య మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. "పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా. తనకు తెలిసిన అధికారి కాబట్టి నేను గతంలో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడాను. మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ నంబర్లు తిరుపతన్న అడిగారు. వారిద్దరి ఫోన్ నంబర్స్ నా అనుచరుల వద్ద తీసుకుని అతనికి ఇచ్చాను. నంబర్లు ఎందుకు ఆడిగావని నేను తిరుపతన్నను ప్రశ్నించా. కానీ మునుగోడు ఎన్నికల సమయంలో ప్రచారం ఎలా జరుగుతుందని తిరుపతన్న నన్ను అడిగారు. ప్రచారం బాగానే జరుగుతోందని నేను ఫోన్లో చెప్పా. ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరుల ఫోన్ ట్యాప్ చేశారనేది అవాస్తవం. మీడియాలో ఎక్స్‌పోజ్ అవ్వాలనే ఉద్దేశంతో కొంతమంది నాపై తప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా పోలీసులకు నేను సహకరిస్తా.
ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. తిరుపతన్నతో మాట్లాడిన కాల్ లిస్ట్ ఆధారంగానే నన్ను ప్రశ్నించారు. పోలీసుల దగ్గర ఏదో ఆధారం ఉంది కాబట్టే నన్ను విచారించారని భావిస్తున్నా. నా స్టేట్మెంట్‌ను వీడియో రికార్డ్ చేశారు. ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తా" అని చెప్పారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలైన బొల్లం మల్లయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డికి సైతం పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత మల్లయ్య, శేఖర్ రెడ్డిలను విచారించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారిగా రాజకీయ నేతలను పోలీసులు విచారిస్తున్నారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మాజీ ఎమ్మెల్యే లింగయ్య విచారణ తర్వాత మరో మాజీ మంత్రికి పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.