- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంట్, నీటి కష్టాలు
దిశ, కూకట్పల్లి : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నీటి, కరెంట్ కష్టాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని ఎన్‌కేఎన్‌ఆర్ గార్డెన్స్‌లో శనివారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నీటి, కరెంట్ కష్టాలు మొదలయ్యాయని అన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గ్రేటర్లో ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించి దీవిస్తే గ్రామాలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని అన్నారు. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసిన గ్రేటర్ వాసులు గులాబీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు.
108 శాతం ఓట్లతో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి రెండు సార్లు అవకాశం ఇచ్చారని, ఈసారి ప్రతిపక్షంలో అవకాశం ఇచ్చారని అన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ ప్రజల హక్కులు, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడతామని అన్నారు. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, కాంగ్రెస్ పాలనను చూస్తే ప్రజలకు బీఆర్ఎస్ పాలన గుర్తు వస్తుంది, విలువ తెలిసి వస్తుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణ మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిందని ఆరోపించారు. ఆడబిడ్డలందరికీ మహాలక్ష్మీ పథకం ఎప్పుడు మొదలవుతుందో ఎదురు చూస్తున్నామని అన్నారు. వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని, వంద రోజులు బరాబర్ వేచి చూస్తామని, ఆ తరువాత ప్రజల పక్షాన పోరాడతామని అన్నారు. లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ బిందెలు ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యస్పదంగా ఉందని అన్నారు.
రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి మీ చేతిలో పెట్టాము, ఆ అభివృద్ధిని నిలుపుకుంటారా..? లేదా అనేది చూడాలని అన్నారు. 70 ఏండ్ల వయస్సు గల మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిడుతూ అనుచితంగా మాట్లాడుతున్నారని, ఓపిక నశిస్తే తాము అదే పద్దతిలో మాట్లాడతామని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అంటూ రేవంత్ రెడ్డి రాజకీయ దివాలకోరుతనానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్లో తెలంగాణ గురించిన గళం విప్పాలన్నా, మాట్లాడలన్నా బీఆర్ఎస్ ఎంపీపిలు కావాలని, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మాట్లాడలేరని అన్నారు. ఫ్రీ బస్తు సౌకర్యం మంచిదే కానీ 35 మంది ఎక్కాల్సిన బస్సులు 50 నుంచి 60 మందిని ఎక్కిస్తున్నారని, డ్రైవర్ సీట్లు, కిటికీల నుంచి ఎక్కుతున్నారని,
మహిళలు చెప్పులతో కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మహిళలకు ఉచిత బస్సు కల్పించే సమయంలో పురుషులకు తగిన న్యాయం చేయాలని, అదే విధంగా ఫ్రీ బస్సులతో నష్ట్ర పోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని, నెలకు వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వరకు ఎవరిని ఆదుకోలేదన్నారు. ఇప్పటి వరకు 16 మంది ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, పగుడాల శిరీషా, ముద్దం నర్సింహయాదవ్, మందాడి శ్రీనివాస్ రావు, పండాల సతీష్ గౌడ్, సబీహ బేగం, ఆవుల రవీందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.