- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేద ప్రజల ఇండ్లు కూలగొడతామంటే మేము ఒప్పుకోం : ఎమ్మెల్యే
దిశ, చైతన్యపురి : మూసీ నది ప్రక్షాళనలో భాగంగా పేద ప్రజల ఇల్లు కూలగొడతామంటే చూస్తూ ఊరుకోబోమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదని అలాగని వారికి ఎటువంటి న్యాయం చేయకుండా, ఎన్నో సంవత్సరాలుగా తాతల నుంచి సంపాదించిన ఆస్తిని నేడు కబ్జా చేశారని కబ్జాదారులని చిత్రీకరించడం ఎంత వరకు న్యాయమన్నారు. ఇటీవల తన ఇంటి మీద అధికారులు మార్కు వేసిన నేపథ్యంలో తన ఇల్లు కూలగొడతారనే భయంతో దిగులుతో చైతన్యపురి డివిజన్ పరిధిలోని వినాయక నగర్ కాలనీలో దాదాపు 53 సంవత్సరాల నుంచి నివాసముంటున్న యాదిరెడ్డికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటికి రావడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… అన్ని రెవెన్యూ రికార్థులలో పట్టా స్థలంగా ఉందని తెలిపారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు తోట మహేష్ యాదవ్, నాయకులు సొంటి చంద్రశేఖర్ రెడ్డి, ప్రవీణ్ చారి, అంజయ్య, నిరంజన్, రామ్ నర్సయ్య, జంగరెడ్డి తదితరులు పాల్గొన్నారు.