- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజల సంపూర్ణ మద్దతుతో అధికారంలోకి వస్తాం
దిశ, చందానగర్: శేరిలింగంపల్లి నియోజక వర్గంలో ప్రజలమద్దతు సంపూర్ణంగా నాకే ఉందని ఎమ్మెల్యేగా గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. సోమవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డికాలనీలో రోడ్డు షోతో పాటు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాదాపూర్ డివిజన్‌లో దోబీఘాట్, నవభారత్ నగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 6 గ్యారెంటీలు వివరించి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్ధించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలకు ప్రజలలో మంచి స్పందన లభిస్తుందని, కాంగ్రెస్ పార్టీకి అన్నీ వర్గాల నుంచి మద్దతు తెలియజేస్తున్నారని గెలుపు మాదేనని ధీమా వ్యక్తం చేశారు.
జగదీశ్వర్ గౌడ్‌కు మద్దతుగా సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు రోడ్ షో..
ప్రజాస్వామ్య రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మియాపూర్‌లోని దీప్తి శ్రీనగర్ కాలనీలో కాంగ్రెస్, టీడీపీ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుటుంబ సంపద, స్వార్థం కోసం స్వలాభం కొసమే బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఆత్మ గౌరవంతో ఉండాల్సిన తెలంగాణ గడ్డ ఒడిదుడుకులకు లోనవుతుందాన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులు చేతులలోకి వెళ్తే గతంలో సృష్టించిన సంపద , ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు.
కాబట్టి హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి. జగదీశ్వర్ గౌడ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ప్రాంతీయ పార్టీలన్ని కూడా కుటుంబ పాలనకే పరిమితం అయ్యాయన్నారు. నిధులు,సంపద , టెక్నాలజీ ఉన్న నియోజక వర్గానికి విద్యావంతులైన జగదీశ్వర్ గౌడ్ ఎంతయినా అవసరమన్నారు. జగదీశ్వర్ గౌడ్ కుటుంబం రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబమని ఎక్కడ కూడా అవినీతి మచ్చలేని వారని అన్నారు. అవినీతి కరమైన, అహంకార పూరిత , అహంభావ పూరితమైన బీఆర్‌ఎస్ ప్రభుత్వం మనకు అవసరం లేదని అలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరముందన్నారు.