అంబర్ పేటలో వీహెచ్ మౌన దీక్ష

by Disha Web Desk 15 |
అంబర్ పేటలో వీహెచ్ మౌన దీక్ష
X

దిశ, అంబర్ పేట : తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తాను బీజేపీకి అనుకూలంగా మాట్లాడినట్టు కొంతమంది చేస్తున్న దుష్ప్రచారంపై తగిన విచారణ చేయాలని, తనను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం అంబర్ పేటలోని తన నివాసంలో మౌన దీక్ష చేపట్టారు. దీక్షకు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి దానం నాగేందర్ శనివారం సాయంత్రం వి.హనుమంతరావు ఇంటికి వచ్చి నిమ్మరసం అందజేసి ఆయన చేత దీక్ష విరమింపజేశారు.

ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశానని తెలిపారు. అనంతరం దానం నాగేందర్ మాట్లాడుతూ పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావుపై ఒక వర్గం చేస్తున్న అసత్య ప్రచారాలు నిరాధారమైనవి న్నారు. బీఆర్ఎస్ పార్టీనే బీజేపీతో లోపాయి కారి ఒప్పందం పెట్టుకుందని, అందుకే నేను ఆ పార్టీలో నుండి బయటకు వచ్చానని చెప్పారు. గతంలో కేటీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుందామని నాతో అన్నారని తెలిపారు. సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో ఎలా పొత్తు పెట్టుకుంటుందన్నారు. ఇప్పటివరకు సెక్యులర్ పార్టీ అని చెప్పుకొని ఏ మొఖం పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకుందామని అంటున్నారని కేటీఆర్ ని ప్రశ్నించానని, ఆ ప్రశ్నకి కేటీఆర్ నుంచి నాకు

సమాధానం రాలేదన్నారు. కానీ ఏదో ఒక రోజు వీళ్లు లోపాయి కారి ఒప్పందం పెట్టుకుంటారని వారితో తెగ తెంపులు చేసుకొని నా సొంత గూటికి వచ్చాను అన్నారు. బీజేపీకి ఉన్నది కేవలం సోషల్ మీడియా మాత్రమే అని, వాటి ద్వారానే అసత్య ప్రచారాలు చేసుకుంటున్నరని తెలిపారు. సిద్ధాంతానికి కట్టుబడి పదవులు వచ్చినా రాకపోయినా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి హనుమంతరావు అన్నారు. ఆయనపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.



Next Story

Most Viewed