శారీలో ఫ్రంట్.. బ్యాక్ అందాలతో కుర్రకారు మతి పోగొడుతున్న కాజల్..!

by Dishafeatures1 |
శారీలో ఫ్రంట్.. బ్యాక్ అందాలతో కుర్రకారు మతి పోగొడుతున్న కాజల్..!
X

దిశ,సినిమా: హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. తర్వాత చందమామ, మగధీర, డార్లింగ్ వంటి సినిమాల్లో నటించి అందరి మనసులను గెలుచుకున్న ఆమె కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ హిందీ భాష చిత్రాల్లో కూడా నటించారు. ఇలా వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఆమె పెళ్లి తర్వాత బాబుకు జన్మనిచ్చిన ఆ సమయంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండేది. ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ మూవీతో తన రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంటూ రోజురోజుకు తన అందాన్ని రెట్టింపు చేసుకుంటుందే తప్ప వయసు పై పడినట్లు ఎక్కడ కూడా కనిపించడం లేదు. కాగా తరచూ గ్లామరస్ ఫోటో షూట్ ‌లు నిర్వహిస్తూ యంగ్ హీరోయిన్లకు ఆమె గట్టి పోటీ ఇస్తున్నారనే చెప్పాలి.

ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా కాజల్ అగర్వాల్ షేర్ చేసినటువంటి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వైట్ కలర్ డిజైనర్ శారీలో ఏంజెల్ లా ఉన్నటువంటి కాజల్ ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇలా కాజల్ గ్లామరస్ ఫోటోలు చూసినటువంటి నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఆమె నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘సత్యభామ’ మే 17న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది అని దర్శక నిర్మాతలు తెలిపారు.

Next Story

Most Viewed