- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్, కేటీఆర్.. కాంప్రమైజ్: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా చిట్ చాట్ లో ఆయన పలు అంశాలు వెల్లడించారు. కేటీఆర్, రేవంత్ కాంప్రమైజ్ అయ్యారు కాబట్టే మొన్నటి జన్వాడా కేసును గాలికి వదిలేశారని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, ఆయన్ను తన బిడ్డ పెళ్లికి కూడా వెళ్లకుండా బీఆర్ఎస్ ఇబ్బందిపెట్టిందని, రేవంత్ ను జైలుకు పంపించారని, అలాంటి వారితో రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ చేసుకుంటాడా? అంటూ బండి ఫైరయ్యారు. రేవంత్, కేటీఆర్ మధ్య ఒప్పందం ఉంది కాబట్టే కేటీఆర్ ను అరెస్ట్ చేయడం లేదని విమర్శలు చేశారు. రేవంత్ తో కేటీఆర్ ములాఖత్ రాజకీయాలు నడిపిస్తున్నారని బాంబు పేల్చారు. తెలంగాణకు రేవంత్ సీఎం అయితే.. కేసీఆర్ కొడుకు యాక్టింగ్ సీఎం అంటూ ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటై బీజేపీని మీడియాలో లేకుండా చూస్తున్నారని బండి ఫైరయ్యారు. బీఆర్ఎస్ లో ఆ పార్టీ గురించి ఆలోచించే వారెవరూ లేరని సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను గద్దె దింపే దమ్ము బీఆర్ఎస్ కు లేదని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉంటారో పోతారో అనే భయం కేటీఆర్ కు పట్టుకుందన్నారు. ప్రజాసమస్యలపై ఎన్నడూ స్పందించని కేసీఆర్.. కేటీఆర్ బామ్మర్ది అరెస్ట్ అయితే అధికారులకు ఫోన్ చేస్తారా? అంటూ బండి ధ్వజమెత్తారు. కేటీఆర్ బామ్మర్ది మీద కేసు అయితే ఎమ్మెల్యేలంతా వెళ్తారా అంటూ మండిపడ్డారు. అదే బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదైతే మాత్రం వారిని కనీసం పరామర్శించరని బండి పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు అభ్యర్థి లేకపోవడం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారని సంజయ్ చురకలంటించారు. బీఆర్ఎస్.. సర్పంచులు, ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టారని సంజయ్ ఫైరయ్యారు. మళ్లీ వారే సానుభూతి చెప్పేందుకు వెళ్తే ఎవరు నమ్ముతారని ఎద్దేవాచేశారు. అందుకే కేటీఆర్ ను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని తెలిపారు. ఆందోళనకారులు కూడా ఆలోచించాలని సంజయ్ సూచించారు. బీఆర్ఎస్ నేతలను ఉద్యమాలకు పిలిస్తే వారే నష్టపోతారన్నారు.
బీఆర్ఎస్ లో హరీష్ రావు ఎంతో కొంత క్రెడిబులిటీ కలిగిన నాయకుడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి ప్రశంసించారు. ఆయన బీజేపీలోకి వస్తానంటే తీసుకోవడం తన ఒక్కడి నిర్ణయం కాదని స్పష్టంచేశారు. తమది ఏక్ నిరంజన్ పార్టీ కాదని, పార్టీలో సమిష్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా కేటీఆర్ అహంకారి అంటూ విమర్శలు చేశారు. కేటీఆర్ ఇకనైనా తమాషాలు మానేయాలని సూచించారు. ప్రధానిని సైతం ఏకవచనంతో సంభోధించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమంగా సంపాదించిన డబ్బు వల్లే అహంకారం పెరిగిందని, కండ్లు నెత్తికెక్కాయని సంజయ్ మండిపడ్డారు. బండి సంజయ్, రేవంత్ ఒక్కటేనని సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని బండి వ్యాఖ్యానించారు. కేటీఆర్ గత చరిత్ర ఏంటని, గతంలో ఆయన, కేసీఆర్ చేసిన వ్యాపారమేంటని, వారికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేటీఆర్ కు రాజ్ భవన్ అంటే గౌరవం లేదని బండి ఫైరయ్యారు. కేటీఆర్ ఆయనకి ఆయనే మలేషియా పారిపోయాడని ప్రచారం చేసుకున్నాడని చురకలంటించారు. ఆయన మలేషియా పారిపోయాడన్నది ఎంత నిజమో.. రాజ్ భవన్ వేదికగా ఆయనపై కుట్ర జరిగిందనేది కూడా నిజమే అయ్యి ఉండొచ్చని బండి వ్యాఖ్యానించారు. కేటీఆర్ కు కలలో కూడా బండి సంజయ్ కనిపిస్తున్నాడని చురకలంటించారు. ఇకపోతే ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీల హామీలపై పాదయాత్ర చేయాలని బండి డిమాండ్ చేశారు. అలాగే ఇండ్లు కూల్చిన చోట రేవంత్ పాదయాత్ర చేయాలన్నారు.