గుర్తు తెలియని దుండగుల చేతిలో ప్రభుత్వ పాఠశాల ధ్వంసం..

by Sumithra |
గుర్తు తెలియని దుండగుల చేతిలో ప్రభుత్వ పాఠశాల ధ్వంసం..
X

దిశ, కార్వాన్ : హైదరాబాద్ ప్రభుత్వ బాలిక పాఠశాలలను గుర్తు తెలియని వ్యక్తులు కూలగొట్టిన ఘటన సోమవారం సీతారాంబాగ్లో వెలుగు చూసింది. స్కూల్ ప్రిన్సిపల్ నాజరీన్ రఫాతి తెలిపిన వివరాల ప్రకారం సీతారాంబాగ్లోని గవర్నమెంట్ గర్ల్స్ ప్రైమరీ స్కూల్ గత 75 సంవత్సరాల నుండి ఇక్కడ కొనసాగుతుందని తెలిపారు. 95 మంది విద్యార్థినిలు ఈ స్కూల్లో చదువుతున్నారని తెలిపారు. అయితే ఈ స్కూల్లో ఇద్దరు టీచర్స్ ఒక ప్రిన్సిపాల్ ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా మే 26న ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు స్కూల్ ని కూలగొట్టారని విద్యార్థినిల తల్లిదండ్రులు ఫోన్ చేసి తమకు సమాచారం ఇచ్చారని అదేరోజు ప్రిన్సిపల్ మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

స్కూల్ పక్కనే ఉన్న లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్రీన్లాండ్ హెల్త్ సెంటర్ సంస్థ స్కూలు భవనానికి చెందిన ఓనర్ మధ్యల ఈ భవనానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తుందని పేర్కొన్నారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి లీగల్ నోటీసులు తమకు ఇవ్వలేదని అన్నారు. వేసవి సెలవుల తర్వాత ఈ రోజే స్కూలు పున ప్రారంభమయ్యిందని విద్యార్థినిలు స్కూల్ కి వచ్చి స్కూల్ పరిస్థితిని చూసి భయబ్రాంతులకు గురి అవుతున్నారని అన్నారు. ఈ విధంగా చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని ప్రిన్సిపాల్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed