పురపాలకలో స్పెషల్ గ్రేడ్ -1,2,3 మున్సిపల్ కమిషనర్‌లకు స్థానచలనం

by Mahesh |
పురపాలకలో స్పెషల్ గ్రేడ్ -1,2,3 మున్సిపల్ కమిషనర్‌లకు స్థానచలనం
X

దిశ, సిటీ బ్యూరో: పదేళ్ల తర్వాత ఎట్టకేలకు పురపాలక శాఖలో లాంగ్ స్టాండింగ్‌లపై సర్కారు చర్యలు చేపట్టింది. బదిలీల్లేకుండా పురపాలక శాఖలో సీట్లకు అతుక్కుపోయిన గ్రేడ్ 1,2,3 మున్సిపల్ కమిషనర్లకు ఎట్టకేలకు స్థానచలనం కలిగించింది. కొత్త సర్కారు ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్న శాఖలో ఏకంగా 24 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. స్థానచలనం కలిగించిన కమిషనర్లలో స్పెషల్ గ్రేడ్ (ఎస్జీ)-1,2,3 కేటగిరీకి భారీగా బదిలీలను చేస్తూ మంగళవారం జీవో 341 ను జారీ చేసింది. వీరిలో కొందరు పోస్టింగ్ ల కోసం వెయిట్ చేస్తున్న స్పెషల్ గ్రేడ్ 1,2,3 కేటగిరీలకు చెందిన కమిషనర్లు ఉన్నారు. వీరిలో కొందరు జీహెచ్ఎంసీలో గతంలో పని చేసిన వారు కూడా ఉన్నాయి. గవర్నర్ కు జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న ఎన్.రఘు ప్రసాద్ సైతం గతంలో జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్ (యూసీడీ)గా పని చేసి, తిరిగి జీహెచ్ఎంసీలో మరోసారి అదనపు కమిషనర్ గా రానున్నారు.

ప్రస్తుతం సీడీఎంఏలో జాయింట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సామ్రాట్ అశోక్ గతంలో జీహెచ్ఎంసీ పరిధిలోని చార్మినార్ జోన్ కు జోనల్ కమిషనర్ గా పని చేశారు. ఈ తాజా బదిలీలతో ఆయన తిరిగి అదనపు కమిషనర్ గా జీహెచ్ఎంసీలో నియమితులయ్యారు. ఈ బదిలీ ఆదేశాలను వెంటనే అమల్లోకి తీసుకురావాలని కూడా సర్కారు జీవోలో ఆదేశించింది. మొత్తానికి కొత్త సర్కారు ఏర్పడిన తొమ్మిది నెలల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడంతో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన పనులు ఎక్కువగా జరిగే పురపాలక శాఖను గాడిన పెట్టేందుకు సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్కారు జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ శాఖల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.20 వేల కోట్లను, అలాగే రాష్ట్ర పురపాలక శాఖకు రూ.15594 కోట్లను కేటాయించడంతో ఇక అభివృద్ధి పనులను ముమ్మరం చేయనుందా ? అన్ని విషయం హాట్ టాపిక్ గా మారింది. మంగళవారం పురపాలక శాఖ చేపట్టిన బదిలీల వివరాలిలా ఉన్నాయి.


Advertisement

Next Story

Most Viewed