వాహనదారులకు అలర్ట్.. నగరంలో నేడు ఈ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు

by Satheesh |
వాహనదారులకు అలర్ట్.. నగరంలో నేడు ఈ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. మొహర్రం పండుగ నేపథ్యంలో నగరంలో ఇవాళ (బుధవారం) పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ముస్లింల ప్రత్యేక ప్రార్థనలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పాతబస్తీ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. ఈ రూట్లలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. మరోవైపు బీబీకా ఆలం ఊరేగింపు సందర్భంగా ఓల్డ్‌సిటీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పాతబస్తీలో భారీగా పోలీసులను మోహరించారు.

Advertisement

Next Story

Most Viewed