- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
దిశ, సికింద్రాబాద్ : వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆదృశ్యమైన ఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంంది. ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం లోహియనగర్ కు చెందిన కె .మహాలక్ష్మి(18) శక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది. రాత్రైనా తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. తెలిసిన వారిని, బంధువులను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో మరుసటి రోజు ఉదయం స్థానిక తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దోమలగూడ ప్రాంతంలో...
దోమలగూడ ప్రాంతానికి చెందిన గోపె వైష్ణవి (22) అనే యువతి రెండేళ్లుగా మహేంద్రహిల్స్ టీఎంసీ కాలనీలోని ఓ ఇంట్లో పని చేస్తుంది. అయితే శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె ఎంతసేపటికీ తిరిగి రాలేదు. దీంతో ఇంటి యజమాని వైష్ణవికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. తెలిసిన వారిని వాకబు చేసినా, పరిసర ప్రాంతాలో వెతికినా ఫలితం లేకపోవడంతో ఆదివారం తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భర్తతో గొడవపడి ...
భర్తతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన గృహిణి ఆదృశ్యమైంది. ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం అడ్డగుట్ట కమ్యూనిటీహాలు సమీపంలో నివాసముంటున్న దీపిక (26) బాలాజీ దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే శనివారం రాత్రి భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయిన దీపిక ఇంటికి తిరిగిరాలేదు. తెలిసిన వారిని వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో ఆదివారం ఆమె భర్త బాలాజీ తుకారాంగేట్ పోలీస్ స్టేషను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.