దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్న బిజెపికి ఈ ఎన్నికలు తగిన గుణపాఠం చెప్పాలి

by Disha Web Desk 11 |
దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్న బిజెపికి ఈ ఎన్నికలు తగిన గుణపాఠం చెప్పాలి
X

దిశ ,ఎల్బీనగర్ : దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కునే బిజెపికి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం సాయంత్రం వనస్థలిపురంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని దేవుని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం సిగ్గుచేటు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

కేంద్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యం అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 15 పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ తెర వెనుక రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని, ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను ఒక్కొక్కటిగా అమలు చేయడం జరిగిందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 30 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలైనా 118 జీవో మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి సమస్యలను పరిష్కరిస్తానని, అలాగే మెట్రో రైలు విస్తరిస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

10 సంవత్సరాలు అధికారంలో ఉన్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కొంగ జపం చేస్తూ బస్సు యాత్ర పేరుతో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నాడని కారు కార్ఖానాకి వెళ్లిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్టం సునీత మహేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఉప్పల శ్రీనివాస్ గుప్తా ,రామ్మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed