ఆ రెండు సెగ్మెంట్లలో ఉత్కంఠ.... బరిలో దిగేదెవరో?

by srinivas |
ఆ రెండు సెగ్మెంట్లలో ఉత్కంఠ.... బరిలో దిగేదెవరో?
X

దిశ, సిటీ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. నామినేషన్ల గడువు రెండు రోజులే ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు టికెట్లు దక్కడంతో ఎన్నికల ప్ర చారంలో దూసుకుపోతున్నారు. ఆ రెండు పార్టీల అభ్యర్థులు నామినేషన్లను కూడా దాఖలు చేస్తున్నా రు. కానీ కాషాయ పార్టీ మెజారిటీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల కూకట్‌పల్లి ప్రేమ్ కుమార్ కు కేటాయింగా మల్కాజిగిరి, మేడ్చల్ టికెట్ల విషయంలో ఉత్కంఠ ఉంది.

ఆ రెండు సెగ్మెంట్లలో ఉత్కంఠ..

మేడ్చల్ జిల్లాలో కూకట్‌పల్లి, మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్ ఐదు నియోజకవర్గాలున్నాయి. వీటిలో కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్‌పల్లి సీట్లను మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, ఎన్వీ ఎస్ ప్రభాకర్‌, ప్రేమ్ కుమార్ కు కేటాయించారు. ఇక పోతే మల్కాజిగిరి, మేడ్చల్ సెగ్మెంట్ల ను పెండింగ్‌లో పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పటికే నాలుగో జాబితాను ప్రకటించింది. తొలి జాబి తాలో 52 మంది, రెండో జాబితాలో ఒకరు, మూడో జాబితాలో 35 మం ది, నాలుగో జాబితాలో 12 మంది పేర్లను ప్రకటించింది. ఇప్పటికి 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా.. జిల్లాలోని రెండు కీలకమైన మల్కాజిగిరి, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ పెట్టడంపై చర్చ నడుస్తోంది.

మేడ్చల్, మల్కాజిగిరిలో పోటాపోటీ

మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్ బీజేపీ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. పార్టీ సీని యర్ నేత కొంపల్లి మోహన్ రెడ్డి టికె ట్ రేసు నుంచి తప్పుకున్నట్లు తెలు స్తోంది. దీంతో ఘట్ కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు అనుచరుడు కూడా బీజేపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో నక్కా ప్రభా కర్‌కు టికెట్ ఇవ్వద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై స్థానిక నేతలు, ఆశావహులు ఒత్తిడి తెస్తున్నట్లు సమా చారం. అయితే ఘట్ కేసర్ ఎంపీపీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏనుగు సుదర్శన్ రెడ్డివైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మేడ్చల్‌లో రెడ్డి సామాజిక వర్గంలో సుదర్శన్ రెడ్డికి పెద్ద ఎత్తున బంధు వర్గం ఉం డడం.. అదే సామాజిక వర్గానికి చెం దిన 81 వేల ఓటర్లు ఉండడం.. ఆర్థి కంగా బలంగా ఉండడంతో సుదర్శన్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు తెలి సిం ది. ఇకపోతే మల్కాజిగిరి సీటును మాజీ ఎమ్మల్సీ రాంచందర్ రావు కాదనుకోవడంతో.. మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌కు టికెట్‌ను కేటా యించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ టికెట్‌ను బీజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్, జాతీ య కోశాధికారి పీఎం సాయి ప్రసాద్ కూడా ఆశిస్తున్నారు. ఆ మూడు నియోజకవర్గాల్లో టికెట్ అశిస్తున్న ఆశావహులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా.. సీటుపై స్పష్టత వచ్చే వరకు పోటీ విషయాలు మాట్లాడడం లేదు. మరోవైపు గుంబనంగా ఉంటు న్నా.. లోలోపల ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కూకట్‌పల్లి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్‌కే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో జనసేనకు 8 సీట్లను కేటాయించింది బీజేపీ. అయితే జనసేన శేరిలింగంపల్లితోపాటు కూకట్‌పల్లి స్థానాలను ఆశిస్తున్నట్లు తెలిసింది. శేరిలింగంపల్లి టికెట్ జనసేనకు కేటాయించవద్దని చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో కూకట్‌పల్లి కోసం జనసేన పట్టుబడుతున్నట్లు తెలిసింది. సోమవారం బీజేపీ నేత ప్రేమ్ కుమార్ జనసేనలో చేరారు. ప్రేమ్ కుమార్ కూడా బీజేపీ టికెట్ కోసం తీవ్ర ప్రయ త్నా లు చేశారు. అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిన ప్రేమ్ కుమార్‌కు కూకట్‌పల్లి టికెట్ ఖరారైంది. అయితే బీజేపీ నియోజకవర్గ నేతలు కూకట్‌పల్లిని జనసేనకు అప్పగించవద్దని, బీజేపీకే కేటాయించాలని ఆందోళనలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed