- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'దున్నేవాడికే భూమి అనే నినాదం అనేక చట్టాలకు రూపకల్పన'
దిశ, హిమాయత్ నగర్ : తెలంగాణలో భూ స్వామ్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో దున్నేవాడికే భూమి అనే నినాదం అనేక చట్టాలకు రూపకల్పన చేసింది. ఆ చట్టాల ద్వారా ప్రజలు భూమిపై హక్కులు పొందారని మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. భూదాన్ భూములను పేదలకు పంచాలని అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ తో మంగళవారం సీపీఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో సత్యనారాయణ రెడ్డి భవన్ లో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కమతం యాదగిరి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలకు కనీసం నివసించడానికి ఇల్లు లేకపోవడం అత్యంత విషాదకరమని ఇది పూర్తిగా ప్రభుత్వాల వైఫల్యమే అని అన్నారు.
నేడు భూదాన్ భూములు అక్రమంగా అన్యాక్రాంతం కాబడ్డాయి. ప్రభుత్వ అధికారుల కనుసన్నలతో కబ్జాదారులు తప్పుడు పత్రాల ద్వారా భూములను తమ వశం చేసుకున్నారన్నారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటి నరసింహ మాట్లాడుతూ పేద ప్రజలకు నివసించడానికి ఇల్లు వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఇవ్వాలని ఉద్దేశంతో సర్వ సేవా సంఘం ఏర్పాటు అయ్యింది. కానీ దానికి భిన్నంగా ఇవాళ పాలకులు ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ రెవెన్యూ అధికారులతోనే కుమ్మక్కు అయ్యి పేదలకు దక్కాల్సిన భూములను డబ్బులు ఉన్న వారికి కట్టబెట్టారు. పేద ప్రజలు సొంత ఇల్లు లేక కిరాయిలు కట్టలేని పరిస్థితి నెలకొన్నది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి స్టాలిన్, జిల్లా కార్యవర్గ సభ్యులు నేర్లకంటి శ్రీకాంత్ , కాంపల్లి శ్రీనివాస్, ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి శేఖర్ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు చెట్టు కింది శ్రీనివాస్, కొమురెల్లి బాబు, సక్రిబాయి తదితరులు పాల్గొన్నారు.