mining mafia : ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న మైనింగ్ మాఫియా..

by Sumithra |
mining mafia : ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న మైనింగ్ మాఫియా..
X

దిశ, ఎల్బీనగర్ : ప్రభుత్వ నియమనిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా సెల్లార్లు తీస్తూ మట్టి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తు ప్రభుత్వ ఆశయాన్ని నీరు కారుస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 38 లోని ఎనిమిది ఎకరాల భూమిలో నమ్మిశ్రీ కన్స్ట్రక్షన్ కంపెనీ అక్రమంగా సెల్లార్ తీస్తున్నారని అన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా భారీ వాహనాలతో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ చుట్టుపక్కల ప్రజలకే కాకుండా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం చేస్తున్నారని, కాలనీవాసులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఆ ఫిర్యాదులు బుట్ట దాఖలు అవుతున్నాయి తప్ప అధికారులు మాత్రం కార్యాచరణ చేపట్టడం లేదని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నియమనిబంధనలు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సెల్లార్ తీస్తూ మట్టి తరలిస్తున్న విషయం తెలుసుకున్న మైనింగ్ డిపార్ట్మెంట్ వారు 35.760 సీఎఫ్టీ మాత్రమే ఫైన్ వేసి నోటీసు పంపారు.

ఇరువురికి నోటీసులు పంపిన మైనింగ్ అధికారులు అసలు వ్యక్తి బిల్డర్ అయినా నమ్మి శ్రీ కన్స్ట్రక్షన్ కంపెనీకి పై ఎలాంటి చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమైనారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ పర్మిషన్ లేకుండా ఎవరైనా తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని మైనింగ్ డీడీ సుశీల్ కుమార్ గత ఫిబ్రవరిలో ఆల్ డిస్టిక్ కలెక్టర్, పోలీస్ శాఖ వారికి, రెవెన్యూ శాఖ వారికి ఇల్లీగల్ మైన్స్ మీద చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రాంతంలో సెల్లార్లో మట్టి తీసినప్పుడు అది కేవలం అక్కడ నిర్మించే కన్స్ట్రక్షన్స్ కి బ్యాక్ ఫీలింగ్ కి వాడుకోవాలి కానీ అలా కాకుండా మట్టి అమ్ముకుంటూ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించుకుంటున్న నమ్మి శ్రీ కన్స్ట్రక్షన్ పై కఠిన చర్యలు తీసుకొని మట్టి తవ్వకాలను ఆపివేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed