- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
గ్రేటర్ లో నాల్గవ రోజు కూడా కొనసాగిన కులగణన స్టిక్కరింగ్..
దిశ, హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్ధిక, విద్య , ఉపాధి, రాజకీయ కుల సర్వే హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ నెల 6వ తేదీన సర్వే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు హౌస్ లిస్టింగ్ స్టిక్కర్లను ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్ లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంటింటికి అంటిస్తున్నారు. అయితే స్టిక్కరింగ్ సందర్భంగా పలు చోట్ల ఇండ్లకు తాళాలు వేసి ఉంటున్నాయి. అయినా అధికారుల కులగణన, సర్వే స్టిక్కర్లు అంటించి వెళ్తున్నారు. కొన్ని చోట్ల ఎన్యుమరేటర్లకు ప్రజల నుండి సహకారం అందడం లేదు. తమకు ఎటువంటి సర్వే అవసరం లేదంటూ ఇంటికి స్టిక్కర్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. అయితే మెజార్టీ ప్రజలు వారికి సహకరిస్తుండడంతో మూడు రోజుల పాటు స్టిక్కరింగ్ పనులను కొనసాగిస్తున్నారు.
పూర్తికాని స్టిక్కరింగ్..
సమగ్ర కులగణన సర్వేలో భాగంగా మొదటి మూడు రోజుల పాటు ఇండ్ల పై స్టిక్కరింగ్ వేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే పలు రకాల కారణాలతో స్టిక్కరింగ్ పనులు పూర్తి కాలేదు. ఎన్యుమరేటర్లకు ప్రతి రోజు 150 నుండి 175 ఇండ్ల వరకు కేటాయించి పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే వారు పూర్తి స్థాయిలో పని చేసినా మూడు రోజుల్లో స్టిక్కరింగ్ పూర్తి చేయలేకపోయారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చాలా చోట్ల నాలుగో రోజు శనివారం కూడా స్టిక్కరింగ్ పనులనే కొనసాగించారు.
సర్కిల్ కార్యాలయాలలో సంప్రదించవచ్చు..
ఏదేని కారణంతో స్టిక్కర్ వేయకున్నా, ఒకవేళ వేసినప్పటికీ సర్వే వివరాలు సేకరించేందుకు ఎన్యుమరేటర్లు రాకపోతే సమీపంలోని జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. అక్కడ కూడా వారికి అనుమాన నివృత్తి జరుగకపోతే జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలని కోరుతున్నారు. కాగా సమగ్ర కులగణనకు వచ్చే అధికారులకు కొంతమంది సహకరించడం లేదు. తమ వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. అటువంటి వారిని వదిలివేసి తర్వాత ఇండ్ల సర్వే పూర్తి చేయాలని, వదిలేసిన ఇండ్ల విషయంలో తిరిగి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని అధికారి ఒకరు తెలిపారు. ఇటువంటి వారి వివరాలు సపరేట్ గా ఉంచుతున్నట్లు ఆయన వివరించారు.