Mahesh Kumar Goud : రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని..

by Aamani |
Mahesh Kumar Goud : రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని..
X

దిశ,రవీంద్రభారతి : రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని అని, బీసీ జనగణన పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మన మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం రవీంద్రభారతిలో టీపీసీసీ నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు అధ్యక్షతన రాష్ట్ర ఓబీసీ సంఘాలచే ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్తూ పార్టీని ముందుకు నడిపిన వ్యక్తిగా పీసీసీ గా నియామకం అయ్యారన్నారు. మహేష్ అన్న నాకంటే ఎక్కువ శ్రమ పడ్డారని అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకున్నారు.వారసత్వ రాజకీయాలు కాకుండా క్షేత్ర స్థాయిలో బలహీన వర్గాల నుండి జెండా పట్టుకొని పైకి వచ్చామన్నారు. మాకు ఎవరు ఇస్తారు అవకాశాలు అనుకోకూడదని పోరాటం చేయాలి గుంజుకోవాలి.. కొట్లాడాలి.. అన్నారు.

రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు న్యాయం జరిగేలా,రిజర్వేషన్ల ప్రక్రియలో ఎన్నికలు జరుగుతాయన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. బలహీన వర్గాలకు, ఎస్సీ,ఎస్టీ,బీసీలకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి ఒదిగి ఎదిగిన నేత మహేష్ కుమార్ గౌడ్ అని, అట్టడుగు వర్గాల నుంచి ఎదిగిన వారు ఆ పదవికి వన్నెతెస్తరని, ఈ రోజుల్లో ఈ స్థాయికి రావడం చాలా కష్టం అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ గా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి కి అన్ని తానై పనిచేశారన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు కేశవరావు ,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీలు అమీర్ అలీఖాన్, ఎగ్గే మల్లేశం , ఎమ్మెల్యేలు వినోద్ , వీర్లపల్లి శంకర్ , మక్కన్ సింగ్ ఠాకూర్, వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి , కార్పోరేషన్ చైర్మన్లు నిర్మలా జగ్గారెడ్డి , ఈరవత్రి అనిల్ శివసేన రెడ్డి , ప్రితం, మెట్టు సాయి కుమార్, కాల్వ సుజాత ,చల్లా నరసింహ రెడ్డి , మత్తినేని వీరయ్య, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, బీసీ సంఘం జాతీయ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శంకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed