ప్రగతిశీల సాహిత్యానికి కేంద్ర బిందువు తెలంగాణ బుక్ ట్రస్ట్

by Sridhar Babu |
ప్రగతిశీల సాహిత్యానికి కేంద్ర బిందువు తెలంగాణ బుక్ ట్రస్ట్
X

దిశ, ముషీరాబాద్ : ప్రగతిశీల సాహిత్యానికి తెలంగాణ బుక్ ట్రస్ట్ కేంద్ర బిందువు అని గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో గల తెలంగాణ బుక్ ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర సంస్కృతి ఉద్యమాలకు సంబంధించిన సాహిత్యాన్ని విస్తృతంగా తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. సాహిత్యం అనేది సమాజంలో భిన్న కుల మతాలను సమైక్యపరుస్తుందని చెప్పారు.

ఈ పుస్తక ప్రదర్శనలో సాహిత్యంలో వివిధ ప్రక్రియలకు సంబంధించిన పుస్తకాలతో పాటుగా పోటీ పరీక్షల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పుస్తకాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. అనంతరం రచయిత సామిడి జగన్ రచించిన భారతదేశ విప్లవ కవి గద్దర్ గ్రంథాన్ని డాక్టర్ రియాజ్ కు బహూకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బుక్ ట్రస్ట్ కార్యదర్శి కోయ చంద్రమోహన్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రాజు, డిప్యూటీ డైరెక్టర్ హరిశంకర్, సామాజిక కార్యకర్త జి.రాములు, సీనియర్ జర్నలిస్ట్ కొండూరు వీరయ్య, కవి తంగిరాల చక్రవర్తి, సామిడి జగన్ రెడ్డి, నరసింహ, గురుమూర్తి, నరేష్, అలకనంద, వాగ్దేవి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story