‘ఈహెచ్ఎస్ అమలుకు చర్యలు తీసుకోండి’

by Aamani |
‘ఈహెచ్ఎస్ అమలుకు చర్యలు తీసుకోండి’
X

దిశ,హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ లో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) అమలుకు వెంటనే చర్యలు తీసుకోవాలని టీజీఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది . ఈ మేరకు టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రతినిధుల బృందం బుధవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ను కలిసి విన్నవించింది. ఈ సందర్భంగా ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో హెల్త్ స్కీం అమలుకు విధివిధానాలు నిర్ణీత మొత్తం, క్యాడర్ వారి మొత్తం లేదా స్కేల్ వారీగా చెల్లింపు రూపంలో ఉండేలా మార్గదర్శకాలు రూపొందించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు . తాము చేసిన వినతికి మంత్రి సానుకూలంగా స్పందించారని డిసెంబర్ 5 తర్వాత రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ఉద్యోగుల సంఘాలతో ఈ విషయాన్ని వివరంగా చర్చించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు . ఈ కార్యక్రమంలో టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed