- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hyd: బాచుపల్లిలో సెంట్రింగ్ లేబర్ అనుమానాస్పద మృతి
దిశ, కుత్బుల్లాపూర్ : బాచుపల్లి వాసవి అర్బన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఓ సెంట్రింగ్ కార్మికుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఎల్. రోహిత్ కొంత కాలంగా బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న వాసవి అర్బన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో సెంట్రింగ్ లేబర్‌గా పని చేస్తున్నారు. బుధవారం సాయంత్రం కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా సెంట్రింగ్ పనిలో ఉన్న రోహిత్ 4వ ఫ్లోర్ నుండి కిందపడి చనిపోయినట్లు సమాచారం. అయితే వాసవి కన్‌స్ట్రక్షన్ కంపెనీ యాజమాన్యం కార్మికుడి మృతి విషయం గోప్యంగా ఉంచుతోంది.
స్థానిక బాచుపల్లి పోలీసుల నుంచి కూడా మృతిడి వివరాలపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తలు పడడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. కార్మికుడు ప్రమాదవ శాత్తు కింద పడ్డాడా లేక ఏదైనా ఘర్షణలో ఎవ్వరైనా భవనంపై నుంచి తోసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో కార్మికుడు ప్రాణాపాయ స్థితిలో ఉండగా బాచుపల్లి మమత హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే కార్మికుడు చనిపోయాడని తెలపడంతో పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ విషయంపై అటు పోలీసులు కానీ, వాసవి యాజమాన్యం కార్మికుడి వివరాలు అడిగినా తెలపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.