- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ పుట్టిన రోజున ఓయూలో నల్ల బెలూన్లు, ప్లకార్డులతో నిరసన
దిశ, సికింద్రాబాద్: తొమ్మిదేండ్ల తెలంగాణ పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యావ్యవస్థను నాశనం చేశాడని బహుజన విద్యార్ది సంఘాల నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఉస్మానియా యునివర్సిటీలో నల్ల బెలూన్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. నిరసనను అడ్డుకున్న ఓయూ పోలీసులు వారిని అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుళ్ళకు రూ. 100 కోట్లు కేటాయిస్తున్న కేసీఆర్ బడులను ఎందుకు నిర్వీర్యం చేస్తుండో తెలపాలన్నారు. దమ్ముంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బడులలో కనీస సౌకర్యాలు లేవని, సరిపడా టీచర్లు లేక పిల్లలకు నాణ్యమైన విద్య కూడా అందడం లేదని అవేదన వ్యక్తం చేశారు.
మాధ్యమిక విద్య, ఉన్నత విద్యను ప్రయివేట్ శక్తులకు అప్పచెప్పాడని మండిపడ్డారు. ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయకుండా, పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రయివేటు యూనివర్సటీలకు పర్మిషన్లు ఇచ్చి వాటిని ప్రోత్సహిస్తున్నాడని పేర్కొన్నారు. ఢిల్లీ, అస్సాం, ఛత్తీస్ గఢ్, బీహార్ వంటి రాష్ట్రాలు విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చి తమ బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తే, బంగారు తెలంగాణ అంటూ గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం విద్యకు ఏడు శాతం నిధులు కూడా కేటాయించకపోవడం సిగ్గు చేటన్నారు. వెంటనే రాష్ట్ర బడ్జెట్ లో 25 శాతం నిధులను విద్యకు కేటాయించి ఖర్చు చేయాలన్నారు. పాఠశాల నుండి యూనివర్సిటీ వరకు ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ వర్సిటీకి సంబంధించిన పోస్టులను ఆయా యూనివర్సిటీలే భర్తీ చేసే పాతవిధానం తీసుకురావాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్దులకు పూర్తిస్థాయిలో ఫెలోషిప్ లు అందచేయాలన్నారు. అరెస్టయిన వారిలో బహుజన స్టూడెంట్స్ జాక్ చైర్మన్ వేల్పుల సంజయ్, ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి తదితరులు ఉన్నారు.