మనూ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన..

by Aamani |
మనూ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన..
X

దిశ, శేరిలింగంపల్లి : తమకు వడ్డిస్తున్న ఆహారం ఏమాత్రం నాణ్యత లేదని, దుర్వాసన వస్తుందని, ఆగ్రహం వ్యక్తం చేస్తూ గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సుమారు 400 మంది విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. గత కొద్దిరోజులుగా విద్యార్థులకు సరియైన ఆహారాన్ని ఇవ్వట్లేదని, విద్యార్థులకు ఇచ్చే ఆహారంలో దుర్వాసన వస్తుందని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై పలుమార్లు హాస్టల్, యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని ఆరోపించారు. గత రెండు రోజులుగా అధికారులు స్పందించకపోవడంతో నిరాహార దీక్షకు దిగినట్లు విద్యార్థులు తెలిపారు. అయితే యూనివర్సిటీ చీఫ్ ఈ సమస్యను వ్యక్తిగతంగా తీసుకొని యూనివర్సిటీ లో జరిగే స్టూడెంట్ ఎలక్షన్ లను రద్దు చేశారన్నారు. స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్ లను వెంటనే నిర్వహించాలని, తమకు ఇచ్చే ఆహారంలో నాణ్యత పెంచాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed