పోలీస్ స్టేషన్‌కి వెళ్లే దారిలో యువకుల రీల్స్..

by Aamani |
పోలీస్ స్టేషన్‌కి వెళ్లే దారిలో యువకుల రీల్స్..
X

దిశ,ఉప్పల్: అక్కడ ఇక్కడ రీల్స్ చేస్తే ఏమొస్తుందిలే అనుకున్నారో ఏమో కానీ కొంతమంది యువకులు రీల్స్ చేసేందుకు ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లే దారిని ఎంచుకున్నారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ వెళ్లే దారిలో ఠాణ బోర్డు కనబడేలా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. దీంతో ఈ ఆకతాయిలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ముందు వీళ్లని బొక్కలో వేయండి సర్.. అంటూ ఓ నెటిజన్ ఫైర్ కాగా, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనేమో.. అని మరొకరు కామెంట్ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు అంటున్నారు.

సీఐ ఎలక్షన్ రెడ్డి వివరణ..

వెంటనే స్పందించిన సీఐ ఎలక్షన్ రెడ్డి రీల్స్ చేసిన యువకులను గుర్తించి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోలీసులపై ఎలాంటి రీల్స్ చేసిన అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిన కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed