- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బడికి వెళ్లిన బాలుడు అదృశ్యం
by S Gopi |

X
దిశ, శేరిలింగంపల్లి: పాఠశాలకు వెళ్లిన బాలుడు తప్పిపోయిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేణు సాగర్, లావణ్య దంపతులు గచ్చిబౌలిలోని అంజయ్య నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు యశ్వంత్ సాగర్(15) రోజూలాగే ఈనెల 9న ఉదయం కొత్తగూడలోని ప్రభుత్వ పాఠశాలకు చదువుకునేందుకు వెళ్ళాడు. కానీ సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో యశ్వంత్ తల్లిదండ్రులు లావణ్య, వేణు సాగర్ లు తోటి స్నేహితులతోపాటు తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో తప్పిపోయిన బాలుడి విషయమై తల్లి లావణ్య రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.
Next Story