- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే : విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
దిశ, కార్వాన్: సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్ పరిధిలో అమ్మవారి విగ్రహాన్ని, ఓ వర్గానికి చెందిన వ్యక్తి తో పాటు మరో ఇద్దరు నీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలుపుతూ సోమవారం సాయంత్రం ఏడు గంటలకు ఓ వీడియోను విడుదల చేశారు. అమ్మవారి విగ్రహం ధ్వంసం జరిగిన ప్రదేశాన్ని అన్ని పార్టీల నాయకులు సందర్శించారని, తనను హౌస్ అరెస్ట్ చేయడం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు. హిందూ కార్యకర్తలు నిరసన చేస్తున్న సందర్భంగా వారికి సంఘీభావం తెలిపేందుకు, ఇంటి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన తమను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక టెర్రరిస్ట్ ను ఎలా బ్లాక్ చేస్తారో, ఆ విధంగా పోలీసులు మా ఇంటి చుట్టూ ఉన్నారని తెలిపారు. గుడి ప్రాంగణంలో ధ్వంసం చేసిన ప్లేసుకు ప్రతి లీడర్ ను అనుమతించారని తనను ఎందుకు అడ్డుకుంటున్నారని రాష్ట్ర సీఎం తో పాటు పోలీస్ కమిషనర్ కు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
గుడి ధ్వంసం చేసిన తర్వాత ఓ స్టేట్మెంట్ వస్తుందని, వ్యక్తి మెంటల్ డిస్టర్బ్ ఉన్నారని, ఈ విధంగా గతంలో కూడా ఓల్డ్ సిటీ, న్యూ సిటీ గుళ్ళపై దాడులు జరిగితే ఈ విధంగా స్టేట్మెంట్ లు ఇవ్వడం పోలీసుల నుంచి వచ్చిందని తెలిపారు. ఓ వ్యక్తి డిస్టర్బ్ అయితే మా గుళ్ళు ఎందుకు కనబడతాయి అని, మస్జిద్, దర్గా ఎందుకు కనబడవని పోలీసులు వాస్తవాలను వెల్లడించాలని కోరారు. ఓ వ్యక్తిని అరెస్టు చేశారని మరో ఇద్దరు పరారి లో ఉన్నట్లు వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి శిక్షించాలని ఆయన పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. తనని ఎన్ని రోజులు హౌస్ అరెస్ట్ చేస్తారని, ఈరోజు కాకుంటే రేపు గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటానని, హిందూ కార్యకర్తలకు వెంబడి నిలబడాలని అనుకుంటున్నానని కానీ పోలీసులు ఈ విధంగా హౌస్ అరెస్ట్ చేస్తారని అనుకోలేదని అన్నారు. అదే విధంగా దాడికి పాల్పడిన వారిని కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.