- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిమ్స్‌లో రోగుల అవస్థలు
దిశ, తెలంగాణ బ్యూరో: స్టాఫ్ నర్సుల సడెన్ స్ట్రైక్ తో మంగళవారం నిమ్స్ లో రోగులు ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా 30 నుంచి 40 మేజర్, మైనర్ సర్జరీల్లో జాప్యం జరిగినట్లు తెలిసింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పేషెంట్లు మరింత సమస్యలను ఎదుర్కొన్నారు. ఓపీ, ఐపీ సేవలకు ఆటంకం ఏర్పడిందని వైద్యులు తెలిపారు. చివరకు ముగ్గురు స్టాఫ్ నర్సులకు ఇచ్చిన మెమోలు వెనక్కి తీసుకుంటామని నిమ్స్ యాజమాన్యం ప్రకటించడంతో స్టాఫ్ నర్సులు ధర్నాను విరమించారు.
మెమోలు ఇవ్వడంతోనే...
విధులకు సకాలంలో హజరుకావడం లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని నిమ్స్ యాజమాన్యం విజయ కుమారి, లలితకుమారి స్లీవా అనే ముగ్గురు సీనియర్ స్టాఫ్ నర్సులకు మోమోలు జారీ చేసింది. వీరంతా నర్సింగ్ యూనియన్ లో యాక్టివ్ గా పనిచేసేవారే కావడం గమనార్హం. నోటీసులకు రెస్పాండ్ కాకపోవడంతోనే మెమోలు జారీ చేయాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ ముగ్గురు మిగతా స్టాఫ్ నర్సులను రెచ్చగొట్టి ధర్నా చేయించారని నిమ్స్ ఆఫీసర్లు ఆరోపిస్తున్నారు. ఏమైనా సమస్యలుంటే అధికారులకు చెప్పి పరిష్కరించుకోవాలని కానీ, ధర్నాలు చేసి పేషెంట్లను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. స్ట్రైక్ చేసే ముందు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. కాగా, పని ఒత్తిడి, ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే మెమోలు ఇస్తున్నారని నిమ్స్ స్టాఫ్ నర్సుల యూనియన్ నేతలు చెబుతున్నారు.
‘‘ఆలస్యంగా వస్తే మోమోలు ఇవ్వొద్దా..? : డా. బీరప్ప, ఇన్ చార్జి డైరెక్టర్, నిమ్స్
డ్యూటీకి ఆలస్యంగా వచ్చే వారికి మెమోలు ఇవ్వకూడదా?. చెప్పకుండా సెలవులు తీసుకుంటే చర్యలు తీసుకోవద్దా?. ఇద్దరి ముగ్గురి సమస్యను ఆస్పత్రి అంతా ఆపాదించాలని స్టాఫ్ నర్సులు ఇష్యూను పెద్దగా చేశారు. పేషెంట్లకు ఇబ్బంది కలిగిస్తూ రోడ్డు మీద కూర్చోని నినాదాలు చేశారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా స్ట్రైక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆలోచించాలి. అనవసర ధర్నాలు చేసి నిమ్స్ ప్రతిష్టను దిగజారిస్తే చూస్తూ ఊరుకోం.
స్టాఫ్ నర్సుల సడెన్ స్ట్రైక్ తో మంగళవారం నిమ్స్ లో రోగులు ఇబ్బందులు పడ్డారు
ఆస్పత్రికి ఉదయం ఐదు నుంచి పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినా, డ్యూటీకి రానట్టు లెక్కిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. యూనియన్లలో ఉన్నాం కాబట్టి ప్రతి స్టాఫ్ నర్సు సమస్యను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని సార్లు కాస్త ఆలస్యం కావొచ్చు. కానీ పేషెంట్లకు ఎక్కడా వైద్యం ఇబ్బంది కావడం లేదు. పైగా ఉదయం వచ్చిన సమయాన్ని చూస్తున్నారే కానీ సాయంత్రం రిటర్న్ టైమ్ను ఎందుకు కౌంట్ చేయడం లేదు. చాలా సార్లు రాత్రి వరకు కూడా ఉండాల్సి వస్తున్నదని. దీనిపై యాజమాన్యం ఏమీ మాట్లాడదు.