- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీఆర్ఏ హక్కుల సాధన కమిటీ ఆవిర్భావం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోడానికి కొత్తగా రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పడింది. అన్ని జిల్లాల్లో ఈ సమస్య ఉన్నందున ప్రతీ జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉండేలా కోర్ కమిటీ కూడా ఏర్పాటైంది. వీఆర్ఏల హక్కులను తిరిగి సాధించుకోవడమే లక్ష్యంగా కొత్త రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది. ఐదు డిమాండ్లకు ప్రభుత్వం నుంచి పరిష్కారం పొందేలా ఎజెండాను కూడా రూపొందించుకున్నది. రానున్న కాలంలో ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉండాలో కోర్ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోనున్నది. వీఆర్ఏ హక్కుల సాధన సమితి పేరుతో ఏర్పాటైన ఈ రాష్ట్ర స్థాయి కమిటీ పేర్కొన్న ఐదు డిమాండ్లు ఇవే :
1. వీఆర్ఏలకు పే స్కేల్‌ను అమలుచేయాలి
2. అర్హులైనవారికి పదోన్నతి సౌకర్యం కల్పించాలి
3. 55 సంవత్సరాల వయసు నిండిన వీఆర్ఏలకు వారి వారసులకు ఉద్యోగాలను కల్పించాలి
4. సమ్మె కాలంలో చనిపోయిన వీఆర్ఏల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలి.
5. 80 రోజుల సమ్మె కాలాన్ని వేతనంతో కూడిన సెలవులుగా ప్రకటించి ఆ మొత్తాన్ని విడుదల చేయాలి.