నిషేధిత చైనా మాంజా పై స్పెషల్ డ్రైవ్...

by Kalyani |
నిషేధిత చైనా మాంజా పై స్పెషల్ డ్రైవ్...
X

దిశ, సిటీక్రైం : మనుషులకు , జంతువులకు, పశువులకు ప్రాణహాని కలిగించే చైనా మాంజా పై హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళహాట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహేష్, సబ్ ఇన్స్ పెక్టర్ లు గత రెండు నెలలుగా ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో అధికంగా పతంగులు, మాంజాలు తయారు చేసే వృత్తిలో ఉన్న వారితో పాటు ఇక్కడ విక్రయాలు జరుపుతున్న దుకాణాల వారితో, అక్కడికి వచ్చే కొనుగోలుదారులతో మాట్లాడి నిషేధిత చైనా మాంజాను ఉపయోగించవద్దని తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో మొత్తం 18 మంది కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిషేధిత చైనా మాంజాను విక్రయించడం చట్టరీత్యా నేరమని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్, అదనపు డీసీపీ అష్వాక్ ,ఏసీపీ వెంకటరెడ్డిలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed