సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కల్పన మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవం..

by Sumithra |   ( Updated:2023-04-05 10:21:52.0  )
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కల్పన మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవం..
X

దిశ, ముషీరాబాద్ : సామాజిక పరివర్తన కోసం నిరంతరం పనిచేయడమే సామాజిక రాజకీయ కార్యకర్త తడ్కకల్పనకు నిజమైన నివాళి అని మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్ భాస్కర్ అన్నారు. సామాజిక కార్యకర్త తడక కల్పన జయంతిని పురస్కరించుకొని కల్పన ఫౌండేషన్ ఆధ్వర్యంలో దళిత బహుజన ఫ్రంట్ కు కల్పన మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవం బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా రాపోలు ఆనంద్ బాస్కర్ మాట్లాడుతూ పేదప్రజల జీవితాల వెలుగులు నింపేందుకు ప్రభుత్వ విధానాలలో మార్పుకు కల్పన కృషి చేసిందన్నారు. తనకు తాను రాటుదేలి రాజకీయ నాయకురాలిగా పరివర్తన చెందిందన్నారు. రెండు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా తడ్కకల్పన సామాజిక కార్యకర్తగా రాజ్యాంగ హక్కుల అమలు కోసం జీవితాంతం పనిచేసిందన్నారు.

కల్పన చేనేత స్వరాజ్య వేదికను ఏర్పాటు చేసి చేనేత కార్మికుల హక్కుల కోసం పాటుపడ్డారన్నారు. డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ దళితుల హక్కుల పోరాటంలో కల్పన మమేకమైందన్నారు. కల్పన బౌతికంగా మనకు దూరమైనా ఆమె ఆశయమైన రాజ్యాధికారంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు బాగస్వామ్యాన్ని సాధించడమే కల్పనకు నిజమైన నివాళి అన్నారు. ప్రముఖ రాజకీయ నాయకురాలు ఇందిర శోభన్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల కోసం కల్పన చేసిన కృషి చిరస్థాయిగా నిలవాలన్నారు. ఎస్సీ, ఎస్టీల నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టి తరపున సర్వే చేసిందన్నారు. కల్పనను గుర్తు చెసుకుంటూ, కల్పనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటు కన్నీరు కార్చారు.

అనంతరం కల్పన పౌండేషన్ చైర్మన్ చారులత మాట్లాడుతూ కల్పన జీవితమంతా పొరాటమేనని గుర్తుచేశారు. పదవ తరగతిలో 50 మంది టాపర్లకు అవార్డులను ఇవ్వనున్నామని ప్రకటించారు. క్యాన్సర్ పై ప్రజలకు అవగహన కల్పిస్తున్నామని చెప్పారు. అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందకట్ల స్వామి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో సేవలు అందించేందుకు కల్పన పౌండేషన్ కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కల్పన పౌండేషన్ కార్యదర్శి డాక్టర్ తడక యాదగిరి, చేనేత సంఘం నాయకులు చిక్క దేవదాస్, డాక్టర్ అంబేద్కర్ కళశాల వైస్ ప్రిన్సిపాల్ వేంకటేశ్వర్లు, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు పులికల్పన, దాసరి ఎగొండ స్వామి, దుబాషి సంజివ్, వేణు, అంబేద్కర్ సంఘం ఓయు అధ్యక్షుడు దివాకర్ పూలే, లెక్చరర్ జానకి రాంరెడ్డి, శ్రీ కళ, ఉపాధ్యాయులు నర్సిరెడ్డి, ప్రీతిలత, లెక్చరర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed