- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్నచెరువు కబ్జా.. అక్రమ నిర్మాణాలను హడ్రా కూల్చుతుందా..?
దిశ, ఎల్బీనగర్, చైతన్యపురిః మన్సూరాబాద్ లోని చిన్నచెరువు కబ్జాలకు గురైంది. చెరువు నుండి వెళ్లే కాలువలను సైతం కబ్జా చేసి భారీ భవనాలు నిర్మించుకున్నారు. ఎఫ్డిఎల్, బఫర్ జోన్ వెలుపల కాలువకు కొద్ది దూరంలోనే ఆక్రమణదారుల శిఖం భూములు ఉన్నాయి. వాటిని ఆసరా చేసుకుని చెరువు ఎఫ్ టియల్ ను కబ్జా చేసారు. తద్వారా ఐదంతస్తులతో భారీ భవనాన్ని నిర్మించి కళాశాలకు అద్దెకు ఇవ్వడం గమనార్హం. ఇందులో చదివే విద్యార్థులకు ఏమైనా ప్రమాదం వాటిల్లితే ఎవరు బాధ్యత వహిస్తారని పర్యావరణ పరిరక్షకులు ప్రశ్నిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు అడ్డగోలు ఎల్ఓసిలు జారీ చేయడం వల్లనే ఇలాంటి దుస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు. గత బిఆర్ఎస్ పాలకుల కనుసన్నల్లో ఈ చెరువు శిఖం ఎఫ్ టి ఎల్ భూమిలో భారీ భవనం నిర్మాణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అవినీతికి అలవాటు పడిన రెవెన్యూ ఇరిగేషన్ జిహెచ్ఎంసి అధికారుల పుణ్యమే ఈ భారీ భవనం నిర్మాణానికి ఆస్కారం ఏర్పడింది.
నిబంధనలు గాలికి..
చెరువు ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ చిన్న చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలోనే బహుళ అంతస్తుల నిర్మాణాలకు ఇరిగేషన్ అధికారులు ఎన్ ఓ సి లు జారీ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. చెరువు ఎఫ్డిఎల్ బఫర్ జోన్ పరిధిలో పట్టా భూములు ఉన్న ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని నిబంధనలు ఉన్నాయి. వాల్టా చట్టాన్ని కాదని ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీలు జారీ చేయడం విస్మయం కలిగిస్తుంది.
హైడ్రా తోనే సమస్య పరిష్కారం..
మన్సూరాబాద్ చిన్న చెరువు పరిధిలో ఆక్రమణకు గురైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా హైడ్రా అధికారులు పరిరక్షించాలని పర్యావరణ మేధావులు కోరుతున్నారు. ఈ ఏరియాలో కబ్జాకు గురై ఎన్నో భవనాలు వెలిశాయని వాటన్నిటిని కూల్చివేసి ప్రభుత్వ భూములను కాపాడాలని వారు కోరుతున్నారు.