- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్సై, కానిస్టేబుల్
దిశ, శేరిలింగంపల్లి: ఓ కేసు విషయంలో తనకు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్‌కు వచ్చిన బాధితుల నుండి లంచం తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు కానిస్టేబుల్. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించారు. గేమింగ్ యాక్ట్ కింద నమోదైన కేసు విషయంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అశోక్, ప్రభు అనే బాధితుల వద్ద నుండి ఎస్సై యాదగిరి, హెడ్ కానిస్టేబుల్ రూ.50వేల లంచం డిమాండ్ చేయగా, రెండు రోజుల క్రితం కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి సూచనతో బాధితుడు రూ.30వేలను పోలీసు స్టేషన్ సమీపంలో ఓ ఆటోలో ఉంచగా.. అక్కడి నుండి కానిస్టేబుల్ తీసుకుని ఎస్సై యాదగిరికి ఇచ్చారు.
మంగళవారం మరో రూ.20 వేలను బాధితుల నుండి హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తనకు న్యాయం చేయమంటే అధికారులు లంచం కోసం వేధిస్తున్నారని బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం అధికారులు వలపన్ని అధికారులు కానిస్టేబుల్ డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు.
ఎస్సై యాదగిరి ఆదేశాల మేరకు ఫిర్యాదుదారుడు నుంచి హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి రూ.20వేలు తీసుకుంటున్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఎస్సై యాదగిరి తీసుకోమంటేనే డబ్బులు తీసుకున్నానని కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి ఏసీబీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు ఏసీబీ అధికారులు. ఎస్సై యాదగిరి అందుబాటులో లేరని, ఆయనను విచారించి చర్యలు తీసుకోనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.