- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధిని చూసి ఆదరించండి
దిశ, శేరిలింగంపల్లి : ప్రజలు అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని, గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులు చేశామని బీఆర్ఎస్ అభ్యర్థి అరెకపూడి గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్రనాయక్ తండా, సర్వే ఆఫ్ ఇండియా, అయ్యప్ప సొసైటీ, సాయి నగర్, మెగాహిల్స్, హరిజన బస్తీ, సాయినగర్ తండా, అరుణోదయ కాలనీలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పలు కాలనీలలో మహిళలు మంగళహారతులతో గాంధీకి స్వాగతం పలికారు. వృద్ధులతో మాట్లాడుతూ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ పింఛన్ వస్తుందా,
ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటూ వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని, అందులో భాగంగా హైదరాబాద్ మహానగరాన్ని అమెరికాకు ధీటుగా అభివృద్ధి చేశామని తెలిపారు. ఇంకా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని అన్నారు. న్యాయపరమైన అంశాలు, కోర్టు కేసుల కారణంగా కొన్ని చోట్ల అభివృద్ధి పనులు తాత్కాలికంగా ఆగాయని, వాటిని కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తానన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పేదలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తొమ్మిది ఏండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నామని స్పష్టం చేశారు. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అని, అందరికి సన్న బియ్యం, అసరా పెన్షన్ల పెంపు, దివ్యాంగుల పెన్షన్ పెంపు, రూ.400 గ్యాస్ సిలిండర్ ఇలా అనేక పథకాలకు రూపకల్పన చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
హఫీజ్ పేట్ డివిజన్ లో గాంధీ ప్రచారం
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, మైత్రీ నగర్ తదితర ప్రాంతాల్లో గాంధీ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలంటూ అభ్యర్థించారు.