- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సికింద్రాబాద్ రైల్వే రక్షణ దళం ద్వారా రూ.42 లక్షల వస్తువులను అప్పగింత..
దిశ, మెట్టుగూడా: ప్రయాణీకులు పోగొట్టుకున్న విలువైన వస్తువులను స్వాధీనం చేసుకొని మరియు తిరిగి ఇవ్వడం అనే లక్ష్యంతో "ఆపరేషన్ అమానత్" అనే పేరుతో రైల్వే రక్షణ దళం పని చేస్తుంది. ప్రతి రోజు సికింద్రాబాద్ స్టేషన్ నుండి 230 పైగా ట్రైన్స్ ద్వారా 2 లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరేందుకు రైల్వే రక్షణ దళం కృషి చేస్తుంది. ప్రయాణికులు కోల్పోయిన మరియు వదిలిపెట్టిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాపలు, ఆభరణాలు, ఇతర వస్తువులను సురక్షితంగా వారికి ఇవ్వడం జరుగుతుంది.
2022 సంవత్సరంలో సికింద్రాబాద్ రైల్వే రక్షణ దళం (RPF)175 సందర్భాలలో ప్రయాణీకుల విలువైన వస్తువులను తిరిగి ఇవ్వడం జరిగింది. ఇందులో రూ.42 లక్షలు విలువ చేసే ల్యాప్‌టాప్, పర్సు, లగేజీ బ్యాగ్ & మొబైల్ ఫోన్‌లు ఉన్నాయి. రైల్వే రక్షణ దళం సీనియర్ డివిజనల్ సెక్యురిటీ కమిషనర్ దేబాష్మిత సి. బెనర్జీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆపరేషన్ అమానత్ కింద ప్రయాణికులు పోగొట్టుకున్న లక్షల విలువ చేసే విలువైన వస్తువులను భద్రంగా వారికి ఇవ్వడం జరుగుతుంది. రైల్వేలో ప్రయాణిస్తున్నప్పుడు వారి వ్యక్తిగత వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని మరియు ఏదైనా సహాయం కోసం మా టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 139 ద్వారా మాకు తెలియజేయమని మేము ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాము అని పేర్కొన్నారు.