సనత్ నగర్ నియోజకవర్గంను వేలాది కోట్లతో అభివృద్ధి చేశా

by Sridhar Babu |
సనత్ నగర్ నియోజకవర్గంను వేలాది కోట్లతో అభివృద్ధి చేశా
X

దిశ, బేగంపేట : ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే నాయకుడిని కాదని, నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తున్నానని, నియోజవర్గంలో వేలాది కోట్లతో అభివృద్ధి చేశానని సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఆదివారం సనత్ నగర్ బన్సీలాల్ పేట, రామ్ గోపాల్పేట, పద్మారావు నగర్ లోని పద్మనాభ రెసిడెన్సీ, సవరాల బస్తీ, బాపూజీనగర్ లలో ఏర్పాటు చేసిన సమావేశాలలో పాల్గొన్నారు. పెరుగుతున్న జనాభా, నూతన భవనాల

నిర్మాణంతో మౌలిక వసతుల అవసరం ఏర్పడుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రోడ్లను ఎంతో అభివృద్ధి చేశామని, నిత్యం రోడ్లపై మురుగునీరు ప్రవహించే సమస్యను పరిష్కరించామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రకటించారు. ఈ సమావేశంలో కృష్ణారావు, అనంత్, శ్రీధర్, సంజయ్, స్వప్న, పద్మారావు నగర్ బి ఆర్ఎస్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పద్మారావు నగర్ పార్క్ లో...

పద్మారావు నగర్ పార్క్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. వాకర్స్ ను కలిసి ఓటును అభ్యర్ధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పార్క్ లను ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు రణధీర్, శ్రీధర్, అడ్వైజర్ చంద్రశేఖర్, చక్రధర్, బాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రజల జీవన ప్రమాణాల పెరియాయి

దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరం మన హైదరాబాద్ ఒక్కటేనని, ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, దూరదృష్టి కలిగిన సీఎం కేసీఆర్ సమర్థ నాయకత్వం వల్లనే ఇది సాధ్యమైందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సిలాల్ పేట్ డివిజన్ లోని నెక్లెస్ ప్రైడ్ గేటెడ్ కమ్యూనిటీ టవర్స్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చాక మరిన్ని అభివృద్ది పనులను చేపడతామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బీ ఆర్ఎస్ పార్లమెంట్ ఇంచార్జ్ తలసాని సాయికిరణ్ యాదవ్, కార్పొరేటర్ కె. హేమలత, నాయకులు జి. పవన్ కుమార్ గౌడ్, లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, వెంకటరమణ, అరుణ్ గౌడ్, నెక్లెస్ ప్రైడ్ కమిటీ అధ్యక్షుడు ఉపేందర్, కోశాధికారి దీపక్, సభ్యులు డాక్టర్ హరినాథ్, ఆనంద్ భాంగ్, లాడు పటేల్, భాను, శుభ, దినేష్, తిరుపతి రాజు, చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.

సనత్ నగర్ పార్క్ లో వాకర్స్ తో సమావేశం

తెలంగాణ ప్రభుత్వం తర్వాత పార్క్ లను ఎంతో అభివృద్ధి చేశామని, వాకర్స్ కు అన్ని సౌకర్యాలు కల్పించామని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఉదయం సనత్ నగర్ లోని కేఎల్ ఎన్ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ లలో వాకర్స్ ను కలిసి ప్రచారం నిర్వహించారు. మంత్రి వెంట సనత్ నగర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొలను బాల్ రెడ్డి, పార్క్ అధ్యక్షులు రమేష్ గౌడ్, రవీందర్ గౌడ్, ఖలీల్, శ్రీనివాస్, సురేష్ గౌడ్, యోగా గురువు కృష్ణ, శేషగిరి, లలితా చౌహాన్, సుబ్బరాజు తదితరులు ఉన్నారు.



Next Story