- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Hyderabad : బ్రాండెడ్ లేబుళ్లతో కల్తీ నూనె విక్రయం

దిశ, వెబ్ డెస్క్ : తక్కువ పెట్టుబడితో, తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే దుర్భుద్ధితో వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు కొందరు వ్యాపారులు. కల్తీ వస్తువులను బ్రాండెడ్ పేరుతో అంటగడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఘటన జరగడంతో వినియోగదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బ్రాండెడ్ ఆయిల్ కంపెనీల స్టిక్కర్లు అతికించి కల్తీ నూనె విక్రయిస్తున్న ఘటన హైదరాబాద్(Hyderabad) లోని మలక్ పేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని మలక్‌పేట గంజ్(Malakapet Gunj)లోని శ్రీ గణేశ్ బాలాజీ లక్డాతర్ ఆయిల్ దుకాణంలో కొంతకాలంగా బ్రాండెడ్ ఆయిల్ కంపెనీ లేబుళ్లు అతికించి కల్తీ నూనెను విక్రయిస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న సౌత్‌ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం దుకాణంలో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో పలువురు మహిళలు బాటిళ్లలో కల్తీ ఆయిల్‌ను నింపుతూ బ్రాండెడ్ కంపెనీల లేబుళ్లను అతికిస్తూ కనిపించారు. కల్తీ ఆయిల్‌తో పాటు బాటిళ్లు, ప్యాకెట్లు, ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్, ఫ్రెష్ హార్ట్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ పేరుతో ఉన్న లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.