తక్షణమే జీతాలు చెల్లించాలి.. ప్రభుత్వానికి నర్సింగ్ ఆఫీసర్ల డిమాండ్

by Anjali |   ( Updated:2024-07-08 07:00:07.0  )
తక్షణమే జీతాలు చెల్లించాలి.. ప్రభుత్వానికి నర్సింగ్ ఆఫీసర్ల డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: నాలుగు నెలలుగా జీతాలు లేక నర్సింగ్ ఆఫీసర్లు ఇబ్బందులు పడుతున్నట్లు సోషల్ మీడియా వేదికన తమ బాధ వెళ్లగక్కారు. టిమ్స్ నుంచి డిప్యూటేషన్లపై ఉస్మానియా, నిలోఫర్, కోఠి మెటర్నిటీ, సరోజినీ, E.N.Tకి వెళ్లిన నర్సింగ్ సిబ్బందికి 4 నెలలు గడుస్తున్నా జీతాలు లేవని.. ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వం స్పందించి తమకు వెంటనే జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కొత్తగా నియమితులైన 4000 మంది నర్సింగ్ ఆఫీసర్ల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని.. వెంటనే ప్రభుత్వం.. తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ స్టేడియం వేదికన నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందించింది. కానీ జీతాలు ఇవ్వకుండా గాలికి వదిలేసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. నర్సింగ్ ఆఫీసర్ల జీతాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సింగ్ ఆఫీసర్లు జీతాలు అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లిస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఏమాయే? అని ప్రశ్నించారు. గొప్పలు చెప్పడం కాదు.. చేసి చూపించాలని ఎద్దేవా చేశారు. ఇప్పటికైన నర్సింగ్ ఆఫీసర్ల శాలరీలు తమ అకౌంట్లలో పడాలని హరీష్ రావు ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed