- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువత ఆలోచించాలి.. దసరాకు మీ దోస్తులతో ఇవి చర్చించండి: హరీశ్ రావు ఆసక్తికర ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకపోగా, మీ ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, రైతు బంధును నిలిపివేశారు, రైతు భరోసా దిక్కులేకుండా పోయింది, బోనస్‌ను బోగస్ చేశారు.. అని పేర్కొన్నారు.
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు.. పది నెలలు గడిచాయి అతీ గతీ లేదు. నాలుగు వేల నిరుద్యోగ భృతికి నీళ్లు వదిలారు.. అని వెల్లడించారు. ఈ దసరాకు మీ ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలాయ్ - బలాయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించండని తెలిపారు. మీ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలతో పాటు, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్‌లపై ఎక్కడిక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.