ట్రెడిషనల్ లుక్‌లో ఫిదా అనిపిస్తున్న నాగార్జున బ్యూటీ.. భువి నుండి దిగివచ్చిన దేవకన్యలా ఉన్నావంటూ

by Kavitha |
ట్రెడిషనల్ లుక్‌లో ఫిదా అనిపిస్తున్న నాగార్జున బ్యూటీ.. భువి నుండి దిగివచ్చిన దేవకన్యలా ఉన్నావంటూ
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘అమిగోస్’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇక రీసెంట్‌గా కింగ్ నాగార్జున సరసన ‘నా సామిరంగ’ మూవీలో నటించి మెప్పించింది. కానీ, ఈ చిత్రం అనుకున్నంత హిట్ అయితే కాలేకపోయింది. దీంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. కానీ, నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అదరహో అనిపిస్తుంది. ఈ క్రమంలో ఆ బ్యూటీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా అషికా రంగనాథ్ ఇన్‌స్టా వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో చీర కట్టుకొని తన వాలు కళ్ళతో వయ్యారంగా చూస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు సూపర్, బ్యూటీఫుల్, భువి నుండి దిగివచ్చిన అప్సరస అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు అ అమ్మడు పిక్స్‌పై ఓ లుక్ వేసేయండి.

(VIDEO LINK CREDITS TO ASHIKA RANGANATH INSTAGRAM ID)

Advertisement

Next Story

Most Viewed