- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నూలు డిపో మంజూరు పట్ల కాంగ్రెస్ శ్రేణుల హర్షం
దిశ, వేములవాడ: వేములవాడ కేంద్రంగా యారన్(నూలు) డిపోను ఏర్పాటు చేయడంతో పాటు రూ.50 కోట్ల నిధులను కేటాయించడం పట్ల వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాజన్న ఆలయం ముందు సి.ఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్‌లు మాట్లాడుతూ.. యారన్ డిపోను వేములవాడలో ఏర్పాటు చేయడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
దాదాపు 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మరమగ్గాల కార్మికుల కల నెరవేరిందని, ఇక వారి కష్టాలు తీరనున్నాయని అన్నారు. వేములవాడ కేంద్రంగా యారన్ డిపోను ఏర్పాటు చేయడం వలన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలలోని సుమారు 30 వేల మరమగ్గాల కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఇప్పపూల అజయ్, నాయకులు సంగ స్వామి యాదవ్, పాత సత్యలక్ష్మి, కనికరపు రాకేష్, పులి రాంబాబు గౌడ్, గూడూరి మధు, తోట రాజు, నాగుల రాము గౌడ్, ముప్పిడి శ్రీధర్, నాగుల విష్ణు, దాడి మల్లేశం, పీర్ మహమ్మద్, పుల్కం రాజు, జడల శ్రీనివాస్, కొక్కుల బాలకృష్ణ, వస్తాది కృష్ణ, వలి, అంబాటి చందు, నాగుల మహేష్, బైరి సతీష్ (పండు) తదితరులు పాల్గొన్నారు.